Honda Jazz: బడ్జెట్ ధరలో లగ్జరీ హ్యాచ్‌బ్యాక్.. సరికొత్త 2026 హోండా జాజ్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారత మధ్యతరగతి కుటుంబాల్లో ఒకప్పుడు 'లగ్జరీ హ్యాచ్‌బ్యాక్' అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు హోండా జాజ్. విశాలమైన క్యాబిన్, స్మూత్ డ్రైవింగ్, ప్రీమియం ఫీల్‌తో భారత రోడ్లపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కారును హోండా సంస్థ కొంతకాలం క్రితం డిస్కంటిన్యూ చేసింది. అయితే ఇప్పుడు అదే జాజ్ పేరు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. 2026 ఫేస్‌లిఫ్ట్ హోండా జాజ్ పేరుతో చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ మోడల్.. మునుపటి కంటే మరింత షార్ప్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఆటో ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో 2026 హోండా జాజ్‌కు సంబంధించిన ఇప్పటివరకు వెల్లడైన ముఖ్య వివరాలు ఇవీ...
Details
2026 హోండా జాజ్: కొత్త లుక్, అదిరిపోయే హంగులు
ఈసారి హోండా ప్రధానంగా 'డిజైన్‌పై ప్రత్యేక ఫోకస్' పెట్టింది. ముందుభాగం కారుకు అగ్రెసివ్ లుక్ అందించేలా కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఇచ్చారు. గ్రిల్ డిజైన్ కూడా మునుపటి కంటే సన్నగా మారి, కారుకు మోడ్రన్ టచ్ ఇచ్చింది. కొత్త కలర్స్ డైనమిక్ బ్లూ, ఫైరీ ఎల్లో, స్టార్రి నైట్ వైట్ అనే 'మూడు సరికొత్త కలర్ ఆప్షన్లను' హోండా పరిచయం చేసింది. సైజు మార్పులు వెడల్పు, ఎత్తు పెద్దగా మారకపోయినా, కారు పొడవు మాత్రం స్వల్పంగా పెరిగి 4,169 మిల్లీమీటర్లకు చేరుకుంది. దీంతో రోడ్డుపై ఈ జాజ్ మరింత రాజసంగా కనిపిస్తుంది.
Details
2026 హోండా జాజ్: క్యాబిన్‌లో ఏమేం మారాయి?
ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేయకపోయినా, అవసరమైన కీలక అప్‌డేట్స్‌ను మాత్రం హోండా అందించింది. ఇన్ఫోటైన్‌మెంట్ పాత మోడల్‌లోని చిన్న స్క్రీన్‌కు బదులుగా ఇప్పుడు 10.1 ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. డ్రైవర్ డిస్‌ప్లే డ్రైవర్ కోసం 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. సింపుల్ సెటప్ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్యాబ్రిక్ సీట్లు, బేసిక్ ఆడియో సిస్టమ్‌నే కొనసాగించారు. అయితే హోండాకు పేరొందిన 'మ్యాజిక్ సీట్స్' ఈ చైనా వెర్షన్‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది.
Details
2026 హోండా జాజ్: ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
మెకానికల్‌గా పెద్ద మార్పులు లేవు. ఇందులో హోండా తనకు నమ్మకమైన 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ నే కొనసాగించింది. పవర్: 122 బీహెచ్‌పీ టార్క్: 145 ఎన్‌ఎం గేర్‌బాక్స్: సీవీటీ ఆటోమేటిక్ హైబ్రిడ్ ఆప్షన్ లేకపోయినా, సిటీ డ్రైవింగ్‌లో ఈ ఇంజిన్ ఎంతో స్మూత్‌గా, రిలయబుల్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ ఆప్షన్ లేకపోయినా, సిటీ డ్రైవింగ్‌లో ఈ ఇంజిన్ ఎంతో స్మూత్‌గా, రిలయబుల్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Details
2026 హోండా జాజ్: ధర ఎంత?
చైనా మార్కెట్‌లో ఈ 2026 హోండా జాజ్ ధర 66,800 యువాన్ల నుంచి ప్రారంభమవుతోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 8.7 లక్షలుగా ఉంటుంది. 2026 హోండా జాజ్: ఇండియాకు వస్తుందా? హోండా జాజ్ అంటే భారతీయులకు ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన ఎమోషన్. అయితే ప్రస్తుతానికి ఈ 2026 మోడల్ చైనా మార్కెట్ కోసమే రూపొందించారు. అంతేకాదు, కేవలం 3,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. భారత మార్కెట్‌లో ప్రస్తుతం హోండా ఎలివేట్, అమేజ్ వంటి మోడళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టినందున, ఈ కొత్త జాజ్ త్వరలో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.