LOADING...
Bolero Neo: మహీంద్రా బొలెరో నియో ధరలు పెంపు.. ఒక్కసారిగా రూ.20వేలు పెంపు!
మహీంద్రా బొలెరో నియో ధరలు పెంపు.. ఒక్కసారిగా రూ.20వేలు పెంపు!

Bolero Neo: మహీంద్రా బొలెరో నియో ధరలు పెంపు.. ఒక్కసారిగా రూ.20వేలు పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా తన బొలెరో నియో (Bolero Neo) లైనప్‌పై ధరలను పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్టంగా రూ.20,000 వరకు ధరలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. తాజా సవరణలతో బొలెరో నియో ప్రారంభ ధర రూ.8.69 లక్షలకు చేరుకోగా, టాప్ వేరియంట్ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ముడి సరుకుల ధరల పెరుగుదలతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో కొనసాగుతున్న వార్షిక ధర సవరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ధరల పెంపు ప్రభావం ముఖ్యంగా లోయర్ వేరియంట్లపై ఎక్కువగా పడింది. బొలెరో నియోలో బేస్ వేరియంట్ అయిన N4పై అత్యధికంగా రూ.20,000 ధర పెరిగింది.

Details

వేరియంట్ వారీగా తాజా ధరలు ఇలా ఉన్నాయి

గతంలో రూ.8.49 లక్షలుగా ఉన్న ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ.8.69 లక్షలకు చేరింది. ఇది సుమారు 2.36 శాతం పెరుగుదలగా నమోదైంది. N4 : పాత ధర రూ.8,49,000 → పెంపు రూ.20,000 → కొత్త ధర రూ.8,69,000 (2.36%) N8 : పాత ధర రూ.9,29,000 → పెంపు రూ.16,000 → కొత్త ధర రూ.9,45,000 (1.72%) N10 : ధరలో ఎలాంటి మార్పు లేదు → రూ.9,79,000 N11 : ధర మార్పు లేదు → రూ.9,99,000 N10 (O) : ధర మార్పు లేదు → రూ.10,49,000

Details

మరింత ప్రీమియంగా ఇంటీరియర్

ఇదిలా ఉండగా, మహీంద్రా 2025లో బొలెరో నియోను బొలెరో మోడల్‌తో పాటు అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా వాహన ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దింది. క్యాబిన్‌లో కొత్త డిజైన్, లెదరెట్ సీట్లు, మెష్ ప్యాటర్న్‌తో కూడిన ఫినిషింగ్‌ను అందించింది. టాప్ వేరియంట్‌కు లూనార్ గ్రే కలర్ థీమ్‌ను, తక్కువ ధర వేరియంట్లకు మోకా బ్రౌన్ కలర్ థీమ్‌ను జత చేయడంతో ఇంటీరియర్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్ వచ్చింది. అలాగే, ఈ అప్‌డేట్‌తో బొలెరో నియోలో రియర్ వ్యూ కెమెరా, 22.9 సెంటీమీటర్లు (సుమారు 9 అంగుళాలు) పరిమాణంలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందించారు.

Advertisement

Details

అందుబాటులో ఆటోమేటిక్ గేర్ బాక్స్

ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, బొలెరో నియోలో 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 98.5 హెచ్‌పీ పవర్‌, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా చూస్తే, ధరలు కొంత పెరిగినా, అప్‌డేటెడ్ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్‌, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా బొలెరో నియో తన సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగుతోంది.

Advertisement