Loading...
Maruti Suzuki: మారుతీ సుజుకీ దూకుడు.. సెప్టెంబరులో దేశీయ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి
మారుతీ సుజుకీ దూకుడు.. సెప్టెంబరులో దేశీయ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి

Maruti Suzuki: మారుతీ సుజుకీ దూకుడు.. సెప్టెంబరులో దేశీయ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ ఇండియా సెప్టెంబరు 2026లో దేశీయ అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇతర వాహన తయారీ సంస్థలకు చేసిన విక్రయాలను కలుపుకుని మొత్తం దేశీయ అమ్మకాలు 30 శాతం పెరిగి 1,91,794 యూనిట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబరులో ఇవి 1,47,461 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులను కలుపుకుని కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా 24శాతం పెరిగాయి. 2025 సెప్టెంబరులో 1,89,665 యూనిట్లుగా ఉన్న మొత్తం విక్రయాలు.. 2026 సెప్టెంబరులో 2,36,013 యూనిట్లకు చేరాయి. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 37 శాతం పెరిగి 1,81,838 యూనిట్లకు చేరాయి. 2025 సెప్టెంబరులో ఈ సంఖ్య 1,32,820 యూనిట్లుగా ఉంది. మినీ, కాంపాక్ట్, మిడ్‌-సైజ్ కార్ల విక్రయాలు కూడా పెరిగాయి.

వివరాలు 

యుటిలిటీ వాహనాలకు భారీ డిమాండ్.. వ్యాన్‌ అమ్మకాల్లోనూ వృద్ధి

ఈ విభాగంలో ఆల్టో, బాలెనో, సెలెరియో, సియాజ్, డిజైర్, ఇగ్నిస్, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ వంటి మోడళ్లు ఉన్నాయి.

ఈ కార్ల అమ్మకాలు గత ఏడాది 74,090 యూనిట్ల నుంచి ఈ సెప్టెంబరులో 91,887 యూనిట్లకు పెరిగాయి.

యుటిలిటీ వాహనాల అమ్మకాల్లో మరింత జోరు కనిపించింది.

ఈ విభాగం విక్రయాలు ఏకంగా 62శాతం పెరిగి 78,911 యూనిట్లకు చేరాయి.

2025 సెప్టెంబరులో ఇవి 48,695 యూనిట్లుగా ఉన్నాయి. బ్రెజ్జా, ఎర్టిగా, ఈ విటారా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, XL6 వంటి మోడళ్లు ఈ విభాగంలో ఉన్నాయి.

వ్యాన్ విక్రయాలు కూడా 10 శాతం పెరిగి 11,040 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 10,035 యూనిట్లు అమ్ముడయ్యాయి.

వివరాలు 

LCV అమ్మకాల్లో జోరు

తేలికపాటి వాణిజ్య వాహనాల (LCV) విక్రయాలు సైతం 18 శాతం పెరిగాయి.

సెప్టెంబరులో దేశీయంగా 3,414 యూనిట్లు విక్రయించగా.. 2025 సెప్టెంబరులో 2,891 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అయితే ఇతర వాహన తయారీ సంస్థలకు చేసిన విక్రయాలు మాత్రం 44 శాతం తగ్గాయి.

గత ఏడాది 11,750 యూనిట్లుగా ఉన్న ఈ అమ్మకాలు ఈసారి 6,542 యూనిట్లకు పరిమితమయ్యాయి.

మారుతీ సుజుకీ ఎగుమతులు దాదాపు 5 శాతం పెరిగాయి. 2025 సెప్టెంబరులో 42,204 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు.. 2026 సెప్టెంబరులో 44,219 యూనిట్లకు చేరాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఆరు నెలల్లోనూ మారుతీ అమ్మకాల్లో భారీ వృద్ధి

ఏప్రిల్‌-సెప్టెంబరు అమ్మకాలను పరిశీలిస్తే.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇతర వాహన సంస్థలకు చేసిన విక్రయాలను కలుపుకుని మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాలు 32శాతం పెరిగి 11,46,523యూనిట్లకు చేరాయి.

2025-26 ఇదే కాలంలో ఈ సంఖ్య 8,71,276యూనిట్లుగా ఉంది. దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 36 శాతం పెరిగి 10,80,240 యూనిట్లకు చేరాయి.

గత ఏడాది ఇదే కాలంలో 7,95,446 యూనిట్లు విక్రయించబడ్డాయి.

ఎగుమతులను కలుపుకుని ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 28 శాతం పెరిగాయి.

2025-26 తొలి ఆరు నెలల్లో 10,78,735 యూనిట్లుగా ఉన్న మొత్తం విక్రయాలు.. 2026-27లో 13,79,378 యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఎగుమతులు 2,07,459 యూనిట్ల నుంచి 2,32,855 యూనిట్లకు పెరిగాయి.

ADVERTISEMENT