Page Loader
Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ 
Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌

Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ 

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం K-EV కోడ్‌నేమ్‌తో కూడిన కాంపాక్ట్ వాహనాల కోసం కొత్త గ్రౌండ్-అప్ EV ఆర్కిటెక్చర్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు జపాన్ మొబిలిటీ షోలో సుజుకీ మోటార్ ప్రదర్శించిన eWX కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉండనుంది. టాటా మోటార్స్ టియాగో ఈవీకి పోటీగా మారుతి సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌‌ను తీసుకొస్తోంది. K-EV హ్యాచ్‌బ్యాక్ కారు ICE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండదు. ఇది గ్రౌండ్-అప్ స్కేట్‌బోర్డ్‌లో అభివృద్ధి చేయనున్నారు.

మారుతి సుజుకీ

2030 నాటికి 6 ఎలక్ట్రిక్ కార్లను విడుదలకు ప్లాన్

భవిష్యత్తులో లాంచ్ చేయబోయే మోడల్స్ గురించి మారుతి సుజుకీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాబోయే EV ధరను తగ్గించడానికి, గుజరాత్‌లోని దాని ప్లాంట్‌లో బ్యాటరీ సెల్‌లను సొంతంగా తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకీ ఈ ఏడాది చివరి నాటికి గుజరాత్ ప్లాంట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్ eVX ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ మిడ్-సైజ్ SUV 2025 ప్రారంభంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దశాబ్దం చివరినాటికి అర డజను ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. 2031 నాటికి దాని మొత్తం అమ్మకాలలో 15 శాతం లేదా దాదాపు 5 లక్షల అమ్మకాలే లక్ష్యంగా కంపెనీ ముందుకు పోతోంది.