2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N
keeway యాజమాన్యం నుండి వస్తున్న Moto Bologna Passione లేదా MBP త్వరలో భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో తన మొదటి M502Nని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది ఈ సంస్థ. ఆటోమేకర్ ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI)తో భారతదేశంలో అడుగుపెడుతుంది, ప్రస్తుతం AARI ఐదు వేర్వేరు తయారీదారుల ద్వారా 26 విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోటార్‌సైకిల్ సబ్-500సీసీ విభాగంలో వస్తుంది. Benelli , Moto Morini, KEEWAY, Zontes, QJ Motor వంటి దిగ్గజ బ్రాండ్‌లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా. ఇప్పుడు ఇటాలియన్ మార్క్ MBP M502N స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను ఆటో ఎక్స్‌పోలో భారతదేశ మార్కెట్ కోసం ప్రదర్శిస్తుంది.
రక్షణ కోసం చక్రాలపై డిస్క్ బ్రేకులు
MBP M502N అద్భుతమైన డిజైన్ తో, ట్విన్-స్పార్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇందులో 17-లీటర్ ఇంధన ట్యాంక్, ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్,హెడ్-ఆకారపు అద్దాలు, సింగిల్-పీస్ స్టెప్-అప్ సీటు, అప్‌స్వేప్ట్ ఎగ్జాస్ట్, స్లిమ్ టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడర్ భద్రత కోసం, MBP M502N మోటార్‌సైకిల్ మొత్తం బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడానికి డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందూ, వెనుకా చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. MBP M502N ధర వివరాలను జనవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ ఈవెంట్ సందర్భంగా వెల్లడిస్తారు. భారతదేశంలో మిడిల్ వెయిట్ స్ట్రీట్‌ఫైటర్ ధర దాదాపు రూ. 5 లక్షలవరకు ఉంది.