Page Loader
ఎంజీ కామెట్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3.. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే..?
సిట్రోయెన్​ ఈసీ3 కి ఒక్కసారి ఛార్జీ చేస్తే 320 కిలోమీటర్ల ప్రయాణం

ఎంజీ కామెట్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3.. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి ఎంజీ కామెట్ ఈవీ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనిలో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సిట్రోయెన్ ఈసీ3 బేస్ మోడల్ 'లైవ్'కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలున్నాయి. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్ అనేది తెలుసుకుందాం. MG కామెట్ EV ప్లష్ వెర్షన్‌లో ఇల్యూమినేటెడ్ లోగోవెనుక ఛార్జింగ్ పోర్ట్, ఆల్-LED లైటింగ్ సెటప్, ఇండికేటర్-మౌంటెడ్ ORVMలు, డిజైనర్ కవర్‌లతో కూడిన12-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి. బంపర్-మౌంటెడ్ ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ ఉంది. మరోవైపు సిట్రోయెస్ ఈసీ3 లైవ్ వేరియంట్ కవర్లు, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, రూఫ్ రెయిల్‌లు, ఫ్లేర్డ్ వీల్ఆర్చ్‌లు, రూఫ్-మౌంటెడ్ యాంటెన్నాతో కూడిన 15-అంగుళాల చక్రాలతో అద్భుతంగా తీర్చిద్దారు.

Details

ఎంజీ కామెట్ ఈవీ బెస్ట్ ఆప్షన్

MG కామెట్ EV 2,974mm పొడవు, 1,505mm వెడల్పు కలిగి ఉంది. సిట్రోయెన్ eC3 పొడవు 3,981mm, వెడల్పు 1,733mm గా ఉండనుంది. సిట్రోయెన్ ఈసీ3లో ఐదు సీట్లు, పార్కింగ్ సెన్సార్లు, మాన్యువల్AC, శాటిన్ క్రోమ్ యాక్సెంట్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో బ్లాక్-అవుట్ క్యాబిన్‌ను అందిస్తుంది. సిట్రోయెన్​ ఈసీ3 కి ఒక్కసారి ఛార్జీ చేస్తే 320 కిలోమీటర్లు, ఎంజీ కామెట్ ఈవీకి ఒక్కసారి ఛార్జీ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఎంజీ కామెంట్ ఈవీ ధర తక్కువతో పాటు అకర్షణీయంగా ఉండటంతో ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎంజీ కామెట్​ ఈవీ ప్లష్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.98లక్షలు,సిట్రోయెన్​ ఈసీ3 లైవ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 11.5లక్షలుగా ఉంది.