ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ ఇవే!`
ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం సేల్స్ అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వివిధ ఆటోమొబైల్ సంస్థలు అనేక మోడల్స్ ను లాంచ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వీటిల్లో మంచి రేంజ్ ఉన్న ఈవీల లిస్ట్ ను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇండియా మార్కెట్లో అత్యధిక రేంజ్ ఉన్న ఈవీగా మెర్సిడేస్ బెంజ్ ఈక్యూఎస్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ 107.8 కేడబ్ల్యూ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. దీని సేల్స్ రికార్డుస్థాయిలో ఉన్నట్లు సమాచారం. కియా ఈవీ6లో 77.4 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండడం దీని ప్రత్యేకత. ఈకారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కి.మీ ప్రయాణించవచ్చు.
బీఎండబ్య్లూ ఐ7ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 631 కిలోమీటర్లు
బీఎండబ్య్లూ ఐ7కి 625 కిలోమీటర్ల రేంజ్ ఉంది. 0-100 కేఎంపీహెచ్ను కేవలం 4.7 సెకన్లలోనే అందుకోవడం విశేషం. హ్యుందాయ్ ఐయానిక్ కి 572. 6 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారును ఒక్కసారి చార్జీ చేస్తే 631 కిలోమీటర్ల దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. బీఎండబ్ల్యూ ఐ4లో 80 కేడబ్య్లూహెచ్ బ్యాటరీతో అకర్షణీయంగా రూపొందించారు. ఇది 590 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇందులో 63 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఇక బీవైడి ఆట్టో 3లో 60.48 కేడబ్య్లూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 521 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.