MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును 2025లో లాంచ్ చేయనుంది. MG సైబర్‌స్టర్ పేరిట ఈ కారును 2025 జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. MG సైబర్‌స్టర్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసిన MG సెలెక్ట్ రిటైల్ ఛానెల్ ద్వారా విక్రయించనున్నారు. ఈ కొత్త రిటైల్ చైన్‌ను JSW MG మోటార్ ఇండియా ఇటీవల ప్రారంభించింది. 2023లో గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ కార్యక్రమంలో సైబర్‌స్టర్‌ను ప్రదర్శించింది.
విదేశీ మార్కెట్ లో సక్సెస్
MG సైబర్‌స్టర్ డిజైన్ పొడవు 4,535 mm, వెడల్పు 1,912 mm, ఎత్తు 1,328 mm, వీల్‌బేస్ 2,689 mmగా ఉంది. ఈ డిజైన్ స్పోర్టీ లుక్స్‌తో పాటు ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఒకసారి ఛార్జింగ్‌తో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విదేశీ మార్కెట్లలో ఇప్పటికే ఈ మోడల్స్ సక్సెస్ సాధించగా, గ్లోబల్ పవర్‌ట్రెయిన్‌ను భారత మార్కెట్‌కు కూడా అందించనున్నారు. ఈ స్పోర్ట్స్ కారు భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.