NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!
    ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ నూతన ఎలక్ట్రిక్ కారు 'విండ్సర్ ఈవీ ప్రో'ను అధికారికంగా భారత మార్కెట్‌లో డెలివరీ ప్రారంభించింది.

    ఇటీవలే లాంచ్ అయిన ఈవీ కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్స్ సాధించడం గమనార్హం.

    విండ్సర్ లైనప్‌లో ఇది కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌గా లభిస్తుంది. స్టాండర్డ్ విండ్సర్ ఈవీతో పోలిస్తే ఇందులో అనేక అదనపు ఫీచర్లు ఉన్నాయి.

    ధర వివరాలు

    విండ్సర్ ఈవీ ప్రో ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.10 లక్షలు. తొలుత కంపెనీ ఈ వేరియంట్‌ను రూ.17.49 లక్షల ప్రత్యేక ధరకు లాంచ్ చేసింది. అయితే, ఈ ధర కేవలం మొదటి 8,000 కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

    Details

     బ్యాటరీ & రేంజ్

    విండ్సర్ ఈవీ ప్రోలో 52.9 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్లు ప్రయాణించగలదని సంస్థ వెల్లడించింది.

    స్టాండర్డ్ విండ్సర్ ఈవీలో ఉన్న బ్యాటరీ సామర్థ్యం 38 కిలోవాట్లు.

    ఎలక్ట్రిక్ మోటార్ శక్తి

    ఈ వేరియంట్‌లో ఎలాంటి మోటార్ మార్పులు లేవు. ఇందులోని మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    Details

    ప్రత్యేక ఫీచర్లు

    విండ్సర్ ఈవీ ప్రోలో కొన్ని కీలక అదనపు ఫీచర్లు ఉన్నాయి

    ఎలక్ట్రిక్ టెయిల్ గేట్

    ADAS Level 2 సిస్టమ్

    బీజ్ & బ్లాక్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్

    15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్

    8.8-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే

    పానోరమిక్ గ్లాస్ రూఫ్

    వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్

    9 స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్

    360 డిగ్రీ కెమెరా

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

    ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

    6 ఎయిర్ బ్యాగులు

    Details

    కాస్మెటిక్ మార్పులు 

    కారులో మూడు కొత్త కలర్ ఆప్షన్లు ప్రవేశపెట్టారు

    సెలడాన్ బ్లూ

    అరోరా సిల్వర్

    గ్లేజ్ రెడ్

    ఇతర కలర్లు

    పెర్ల్ వైట్

    స్టార్బస్ట్స్ బ్లాక్

    టర్కోయిస్ గ్రీన్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఆటో మొబైల్

    Kia EV4: సెడాన్, హ్యాచ్‌బ్యాక్ వెర్షన్లలో కియా ఈవీ4.. 630 కిమీ రేంజ్, హై-పర్ఫార్మెన్స్ వివరాలు ఇవే! కియా మోటర్స్
    Maruti Suzuki Alto K10: బడ్జెట్ కారులో హై సేఫ్టీ! ఆల్టో K10 అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మారుతీ సుజుకీ
    Maruti Suzuki Sales : భారత మార్కెట్లో మారుతి సుజుకి హవా.. ఫిబ్రవరిలో 1.6 లక్షల కార్ల విక్రయాలు  మారుతీ సుజుకీ
    Mercedes-Benz: 2027 నాటికి 22 కొత్త కార్లు విడుదల చేయనున్న మెర్సిడెస్-బెంజ్ మెర్సిడెస్ బెంజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025