Loading...
Mini Cooper Convertible: రూ.62.90 లక్షలకు భారత్‌లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల
రూ.62.90 లక్షలకు భారత్‌లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల

Mini Cooper Convertible: రూ.62.90 లక్షలకు భారత్‌లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మినీ ఇండియా భారత మార్కెట్లో మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.62.90లక్షలుగా నిర్ణయించింది. పూర్తిగా తయారైన యూనిట్ (CBU)రూపంలో దేశానికి తీసుకొచ్చిన ఈ కారు బుకింగ్స్‌ను ప్రస్తుతం మినీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నారు. కస్టమర్లకు డెలివరీలు గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. డిజైన్ పరంగా స్టార్‌డస్ట్ ఎడిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కారుకు ప్రత్యేకమైన స్పార్క్లింగ్ కాపర్ గ్రే మెటాలిక్ కలర్‌ను అందించగా,వైబ్రెంట్ సిల్వర్ మిర్రర్ క్యాప్స్,18 అంగుళాల JCW Rallye Spoke అల్లాయ్ వీల్స్ స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతున్నాయి.

వివరాలు 

40 సెంటీమీటర్ల సన్‌రూఫ్ మోడ్

నలుపు రంగులో ఉండే MINI Yours ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సాఫ్ట్ టాప్పై యూనియన్ జాక్ డిజైన్ ఉండటం దీని ప్రత్యేకత. దీంతో ఈ కన్వర్టిబుల్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ కారులోని సాఫ్ట్ టాప్ కేవలం 18 సెకన్లలో తెరుచుకోగా, 15 సెకన్లలో మూసుకుపోతుంది.

గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ దీనిని ఆపరేట్ చేయవచ్చు.

పూర్తిగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేని సందర్భాల్లో 40 సెంటీమీటర్ల సన్‌రూఫ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

రూఫ్ తెరిచి ఉన్నప్పుడు 160 లీటర్ల లగేజ్ సామర్థ్యం ఉండగా, మూసిన తర్వాత అది 215 లీటర్లకు పెరుగుతుంది.

క్యాబిన్‌లో హై రిజల్యూషన్ వృత్తాకార OLED డిస్‌ప్లేతో పాటు MINI Operating System 9ను అందించారు.

వివరాలు 

204 హెచ్‌పీ పవర్,300 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి

రీసైకిల్ చేసిన సింథటిక్ లెదర్ వెస్కిన్ (Vescin)తో తయారైన స్పోర్ట్స్ సీట్లు,హెడ్-అప్ డిస్‌ప్లే,హర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పనితీరు విషయానికి వస్తే,ఈ కారులో 2.0లీటర్ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు.

ఇది 204 హెచ్‌పీ పవర్,300 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు.

ఈ కన్వర్టిబుల్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 6.9సెకన్లలో చేరుకోగలదని,గరిష్టంగా 240 కిమీ/గంట వేగంతో దూసుకెళ్తుందని మినీ వెల్లడించింది.

కాంపాక్ట్ లగ్జరీ కన్వర్టిబుల్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరును ఈ స్టార్‌డస్ట్ ఎడిషన్ అందించనుంది.

ADVERTISEMENT