Lexus ES 350h: భారత మార్కెట్లో కొత్త Lexus ES 350h లాంచ్.. ప్రారంభ ధర రూ.66.10 లక్షలు.. బుకింగ్స్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
లెక్సస్ భారత మార్కెట్లో కొత్త Lexus ES 350hను అధికారికంగా విడుదల చేసింది. కొత్త హైబ్రిడ్ సెడాన్‌తో కంపెనీ తన సెడాన్ శ్రేణిని మరింత విస్తరించింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.66.10 లక్షల నుంచి రూ.71.80 లక్షల వరకు ఉంది. ఇప్పటికే ఈ మోడల్‌కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కంపెనీ భారత పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న పూర్తిగా ఎలక్ట్రిక్ ES 500eతో పాటు ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ధర పరంగా చూస్తే కొత్త ES 350h, ES 500e కంటే మరింత అందుబాటులో ఉంది. ప్రస్తుతం ES 500e ధర రూ.89.99 లక్షలు.
వివరాలు
ముందు భాగంలో స్పిండిల్ గ్రిల్..
హైబ్రిడ్ సెడాన్‌లోని అత్యంత ప్రీమియం వేరియంట్ కూడా ఎలక్ట్రిక్ మోడల్‌తో పోలిస్తే రూ.18.19 లక్షలు తక్కువ.
అయితే, గత తరం ES 350hతో పోలిస్తే కొత్త మోడల్ ధర రూ.2.10 లక్షలు పెరిగింది.
ఈ ధరలతో కొత్త Lexus ES 350h ప్రీమియం లగ్జరీ సెడాన్ విభాగంలో కొనసాగనుంది.
ఈ సెగ్మెంట్‌లో ఇది Mercedes-Benz E-Class, BMW 5 Series, Audi A6 వంటి కార్లకు పోటీగా నిలవనుంది.
ఎనిమిదో తరం Lexus ES, TNGA GA-K ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది.
కంపెనీ "Provocative Simplicity" డిజైన్ తత్వాన్ని ఈ కారులో అనుసరించింది.
ముందు భాగంలో సంప్రదాయ స్పిండిల్ గ్రిల్‌కు బదులుగా మూసివేసిన డిజైన్‌ను అందించారు.
వివరాలు
ప్రత్యేక ఆకర్షణగా బ్లాక్ ఫినిష్ వర్టికల్ ఎలిమెంట్లు..
అలాగే ట్విన్ 'L' సిగ్నేచర్ డే టైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉన్న బ్లాక్ ఫినిష్ వర్టికల్ ఎలిమెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సైడ్ ప్రొఫైల్‌లో పైకి ఎగసే బెల్ట్ లైన్‌తో పాటు డోర్లపై 'Z' ఆకారంలో ట్రిమ్ డిజైన్ ఇచ్చారు.
వెనుక భాగంలో కనెక్టెడ్ LED లైట్ బార్, ట్విన్ 'L' సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్‌లు కారుకు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
హైబ్రిడ్, ఎలక్ట్రిక్ రెండు వెర్షన్లకూ ఒకే డిజైన్‌ను ఉపయోగించారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త ES మరింత పెద్దదిగా వచ్చింది.
దీని పొడవు 170 మి.మీ, వెడల్పు 55 మి.మీ, ఎత్తు 130 మి.మీ పెరిగింది. వీల్‌బేస్ కూడా 80 మి.మీ ఎక్కువగా ఉంది.
వివరాలు
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
సింపుల్, క్లట్టర్-ఫ్రీ డ్యాష్‌బోర్డ్‌తో పాటు మధ్యలో 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు.
ఫిజికల్ బటన్లు చాలా తక్కువగా ఉండగా, కొన్ని టచ్-సెన్సిటివ్ ప్యానెల్స్ చేతిని దగ్గరకు తీసుకెళ్లగానే వెలుగుతాయి.
ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్‌తో స్పీకర్ గ్రిల్స్, 3D ప్రింటెడ్ ఇల్యూమినేటెడ్ డోర్ ప్యాడ్స్, Mark Levinson సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, రెండు వైర్‌లెస్ ఛార్జర్లు, హీటింగ్, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ IRVM, అంబియెంట్ లైటింగ్, వెనుక సన్‌షేడ్స్, పవర్ ఆపరేటెడ్ బూట్‌లిడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
వివరాలు
అదిరిపోయే డిజైన్..
భద్రత విషయంలో కూడా కొత్త Lexus ES 350hలో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, సరౌండ్ వ్యూ కెమెరాలు, రాడార్ ఆధారిత క్రూయిజ్ కంట్రోల్, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ డౌజినెస్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, అన్ని వైపులా పార్కింగ్ సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన కొత్త Lexus ES 350h.. సంప్రదాయ ఇంజిన్లతో వస్తున్న జర్మన్ లగ్జరీ సెడాన్‌లకు ప్రత్యామ్నాయంగా, ఆధునిక డిజైన్‌తో పాటు బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను అందిస్తోంది.
వివరాలు
ఇంజిన్ వివరాలు ఇవే..
ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త Lexus ES 350hలో 2.5 లీటర్, నాలుగు సిలిండర్ల స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ను ఎలక్ట్రానిక్‌గా నియంత్రించే e-CVT (Continuously Variable Transmission)తో జత చేశారు.
పెట్రోల్ ఇంజిన్ 186 హెచ్‌పీ పవర్, 235 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఎలక్ట్రిక్ మోటార్ ఒక్కటే 201 హెచ్‌పీ పవర్, 270 ఎన్‌ఎం టార్క్ను అందిస్తుంది.
ఈ రెండు కలిసి మొత్తం 244 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ లగ్జరీ సెడాన్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.7 సెకన్లలో అందుకోగలదు.
ప్రశాంతమైన డ్రైవింగ్ అనుభూతితో పాటు అవసరమైనప్పుడు వేగంగా స్పందించే పనితీరును కోరుకునే కొనుగోలుదారులను ఈమోడల్ ఆకట్టుకునే అవకాశముంది.