Page Loader
Royal Enfield Classic 350: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 వచ్చేసింది.. రేపే లాంచ్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 వచ్చేసింది.. రేపే లాంచ్

Royal Enfield Classic 350: కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 వచ్చేసింది.. రేపే లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2024
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్-350 బైక్ పై ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ బైకును రేపు విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అట్రాక్టివ్ ఫీచర్లతో ఈ బైక్ ను మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో బ్రాండ్ వాల్యూమ్స్ 8శాతం క్షీణించడంతో, అమ్మకాలను పెంచేందుకు ఈ అప్డేట్‌ని ఆ సంస్థ తీసుకొచ్చింది. ఎల్ఈడీ హెడ్‌లైట్, సిగ్నల్స్ వెనుక లైట్‌లో మార్పులు, కొత్త కలర్ వేరియెంట్స్‌ను అందిస్తున్నామని ఆ సంస్థ స్పష్టంచేసింది.

Details

లుక్స్ పరంగా స్వల్ప మార్పులు

ఈ బైక్ 6,100 ఆర్‌పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్, 4,000 ఆర్‌పీఎం వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులతో కూడిన ట్విన్ డౌన్​ట్యూబ్​ స్పైన్ ఫ్రేమ్, వెనుక భాగంలో 6-స్టెప్స్ ప్రీలోడ్ అడ్జెస్టిబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. 349 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్ వ్యవస్థల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. లుక్స్ పరంగా కొన్ని ఛేంజస్ చేయనున్నట్లు సమాచారం. ఈ బైక్ ప్రస్తుత ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉండనుంది.