
జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో POCO C50 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 3న విడుదల కాబోతుంది. ఇందులో MediaTek లేదా JLQ నుండి ఎంట్రీ-లెవల్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. JLQ మార్కెట్లో కొత్త, Android ఆధారిత హ్యాండ్‌సెట్‌లు మరియు టాబ్లెట్‌ల కోసం SoCల తయారీపై దృష్టి పెడుతుంది.
POCO భారతదేశంలో C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయలేదు. జూన్ 2022లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన C40 మోడల్, ఇక్కడ అందుబాటులో లేదు. C50 నవంబర్‌లో ఇక్కడకు వస్తుందని సంస్థ గతంలో ధృవీకరించింది, కానీ అది వాయిదా పడింది.
దేశంలో మంచి అమ్మకాలను నమోదు చేసిన C31, C3 తర్వాత లాంచ్ తర్వాత C50 మూడవ ఫోన్ అవుతుంది.
POCO C50
ధర, ఇతర వివరాలు లాంచ్ అయినప్పుడు వెల్లడించే అవకాశం
POCO C50, C40 మోడల్‌కు సమానమైన డిజైన్ ఉంటుంది. వెనుకవైపు పూర్తి-వెడల్పు కెమెరా, ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కూడా ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ రక్షణతో HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 4GB RAM, 64GB స్టోరేజ్ తో వస్తుంది.1TB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. కెమెరా గురించి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇది Android 12-ఆధారిత MIUIని బూట్ చేయగలదు. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది పసుపు రంగు ఆప్షన్ లో వచ్చే అవకాశం ఉంది.
భారతదేశంలో POCO C50 ధర ఇతర వివరాలు లాంచ్ అయిన రోజున వెల్లడవుతాయి. Samsung, Realme, Infinix మోడల్‌లతో ఈ ఫోన్ పోటీపడే అవకాశం ఉంది.