Honda ADV 160: హోండా నుంచి ప్రీమియం మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్‌కు గట్టి పోటీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో ప్రీమియం అడ్వెంచర్ స్టైల్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు హోండా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తాజాగా కొత్త హోండా ADV 160 డిజైన్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలు చేసింది. దీంతో ఈ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలపై ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భారత్‌లో ఈ స్కూటర్ లాంచ్ అయితే యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 వంటి స్పోర్టీ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ హోండా ఈ మోడల్‌ను తీసుకురావచ్చని భావిస్తున్నారు.
వివరాలు
అడ్వెంచర్ లుక్‌తో ఆకట్టుకునే డిజైన్
అయితే హోండా ఇప్పటివరకు అధికారికంగా లాంచ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. పేటెంట్ ఫైలింగ్ కేవలం డిజైన్ రక్షణ కోసమే అయ్యి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. హోండా ADV 160 సాధారణ స్కూటర్లకు పూర్తి భిన్నంగా అడ్వెంచర్ స్టైల్ డిజైన్‌తో వస్తుంది. ముందుభాగంలో షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్, ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ LED DRLs స్కూటర్‌కు స్పోర్టీ మరియు అగ్రెసివ్ లుక్‌ను అందిస్తున్నాయి. ఇందులో పొడవైన అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, మస్క్యులర్ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌కు బదులుగా సెంట్రల్ స్పైన్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సంప్రదాయ ఫ్యామిలీ స్కూటర్లకు భిన్నంగా, ప్రీమియం మరియు స్టైలిష్ మోడల్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని హోండా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఫీచర్లలో హైటెక్ టచ్
అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్కూటర్ మాట్టే ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, మాట్టే నలుపు వంటి పలు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మొత్తం డిజైన్ చూస్తే ఇది మ్యాక్సీ స్కూటర్ ఫీల్‌తో పాటు అడ్వెంచర్ బైక్ స్టైలింగ్‌ను కూడా కలగలిపినట్లు కనిపిస్తుంది. ఫీచర్ల పరంగా హోండా ADV 160 ఆధునిక టెక్నాలజీతో నిండి ఉంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పూర్తి LED లైటింగ్, కీ లెస్ ఇగ్నిషన్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, హోండా స్మార్ట్ కీ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ కూడా ఈ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
పవర్‌ఫుల్ ఇంజిన్
ప్రాక్టికాలిటీ కోసం 27-30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 8.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. స్కూటర్ ముందు భాగంలో 14 అంగుళాల, వెనుక భాగంలో 13 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్ ఛానల్ ABS కూడా ఇందులో ఇచ్చారు. హోండా ADV 160లో 156.9cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ సుమారు 15.8 bhp పవర్, 14.7 Nmటార్క్ ఉత్పత్తి చేస్తుంది. నగర రోడ్లపై రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా హైవే టూరింగ్‌కు కూడా ఈ స్కూటర్ అనుకూలంగా ఉండే అవకాశముంది. భారత్‌లో ఈ స్కూటర్ విడుదలైతే హోండా లైనప్‌లోనే అత్యంత ప్రీమియం స్కూటర్లలో ఒకటిగా నిలవనుంది.