Loading...
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ప్రారంభం.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరే ఫీచర్లు
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ప్రారంభం.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరే ఫీచర్లు

Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ప్రారంభం.. కొత్త గేర్‌బాక్స్‌, అదిరే ఫీచర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా.. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. పుణెలోని చకన్‌ ప్లాంట్‌లో ఈ కొత్త మోడల్‌ తయారీ మొదలైంది. అక్టోబర్‌ 6న స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. 2022లో భారత్‌లోకి వచ్చినప్పటి నుంచి స్లావియా 80,000 యూనిట్లకు పైగా విక్రయమైంది. మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలో ఈ కారు ప్రస్తుతం 30 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్‌, టెక్నాలజీ, సౌకర్యాలు, భద్రతకు సంబంధించి పలు మార్పులు చేశారు. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లతో కూడిన రీడిజైన్‌ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌, కొత్త డిజైన్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఇల్యూమినేటెడ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌ను ఇందులో అందించారు.

వివరాలు

కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్

ఇంటీరియర్‌లోనూ కొత్త కలర్‌ థీమ్స్‌ను తీసుకొచ్చారు. ఇక మోంటే కార్లో వేరియంట్‌లో డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ ఫినిష్‌, బ్లాక్‌డ్‌ అవుట్‌ స్టైలింగ్‌ ఎలిమెంట్స్‌, ప్రత్యేకమైన బ్యాడ్జింగ్‌ కొనసాగనున్నాయి.

స్కోడా మోటార్‌స్పోర్ట్‌ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌ అంశాలను కూడా ఈ వేరియంట్‌లో అందించారు.

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో యాంత్రికంగా వచ్చిన అతిపెద్ద మార్పు కొత్త 8-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌. ఇది 1.0 లీటర్‌ TSI ఇంజిన్‌తో జతకానుంది.

ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ స్థానంలో ఈ కొత్త గేర్‌బాక్స్‌ను తీసుకొచ్చారు. అయితే 1.5 లీటర్‌ TSI ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇది యథావిధిగా 7-స్పీడ్‌ DSG గేర్‌బాక్స్‌తో కొనసాగుతుంది.

వివరాలు

రియర్‌ సీట్‌ మసాజ్‌ ఫంక్షన్

ఫీచర్ల విషయానికి వస్తే.. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో పలు కొత్త సదుపాయాలను అందించారు. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా వెనుక సీట్లకు మసాజ్‌ ఫంక్షన్‌ను ఇందులో తీసుకొచ్చారు.

అలాగే పెద్ద డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఇంటిగ్రేటెడ్‌ AI అసిస్టెంట్‌తో కూడిన 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అందించారు.

ADVERTISEMENT

వివరాలు

భద్రతకు ప్రాధాన్యం

స్లావియా ఇప్పటికే గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్టుల్లో పెద్దలు, చిన్నారుల రక్షణ విభాగాల్లో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది.

ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లోనూ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. మొత్తంగా 25కు పైగా యాక్టివ్‌, పాసివ్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ను అందించారు.

ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, రియర్‌ డీఫాగర్‌, ఆటో డిమ్మింగ్‌ IRVM వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇవి డ్రైవర్‌కు మెరుగైన విజిబిలిటీతో పాటు సౌకర్యాన్ని అందించనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌ నుంచి 40కి పైగా దేశాలకు ఎగుమతులు

కైలాక్‌, కుషాక్‌లతో పాటు స్లావియా కూడా స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా (SAVWIPL) భారత్‌ కేంద్రంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తుల్లో ఒకటి.

భారత్‌లో తయారయ్యే స్లావియాను వియత్నాం, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా వంటి మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ ఉత్పత్తి ప్రారంభం.. భారత్‌లో SAVWIPLకు ఉన్న తయారీ సామర్థ్యాన్ని మరోసారి చాటుతోంది.

ఇప్పటివరకు సంస్థ భారత్‌లో 20 లక్షలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసింది. అలాగే 40కి పైగా దేశాలకు 7.25 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసింది.

ప్రస్తుతం భారత్‌లో స్కోడా సెడాన్‌ లైనప్‌లో స్లావియాతో పాటు ఆక్టావియా RS కూడా ఉంది. తదుపరి తరం సూపర్బ్‌ 2027లో భారత మార్కెట్లోకి రానుంది.

ADVERTISEMENT