Rolls-Royce: రోల్స్ రాయిస్ మొట్టమొదటి లగ్జరీ EV స్పెక్టర్ వచ్చేసింది..ధర ఎంతంటే
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. దీని ధర 7.5 కోట్ల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభమవుతుంది.ఇది మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. విద్యుత్ శక్తితో నడిచే ఈ రెండు-డోర్ల కూపే 2022లో గ్లోబల్ ప్రీమియర్‌ను కలిగి ఉంది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ 102 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 530 కిమీ (WLTP సైకిల్) పరిధిని కలిగి ఉంటుంది. వాహనంలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ప్రతి యాక్సిల్‌పై ఒకటి-577 bhp, 900 Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. స్పెక్టర్ కేవలం 4.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.