RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది. ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో ధరతో సమానంగా ఉండడం విశేషం. దీని ధర రూ.1.25 లక్షలు ఉండనుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, రన్ఆర్ మొబిలిటీ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హెచ్‌ఎస్ ఈవీగా ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ అనే ఐదు కలర్లలో రానుంది. ఈ వాహనం గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. RunR మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 60 V 40 AH Li-on లిక్విడ్-కూల్డ్ వైర్ బౌండెడ్ బ్యాటరీలను ఉపయోగిస్తోంది.
RunR HS EV ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్
ఇందులో హెడ్‌ల్యాంప్‌లో చిన్న ట్యూబ్ లాంటి లైటింగ్ ఎలిమెంట్, LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. సీటు ఒక ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు సాధారణ గ్రాబ్ రైల్ ఉంది. ఇది కాకుండా అల్లాయ్ వీల్స్ ఆఫర్‌లో ఉండడం విశేషం. RunR HS EV ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని RunR మొబిలిటీ వ్యవస్థాపకుడు మిస్టర్ సేతుల్ షా పేర్కొన్నారు. ఈ వాహనం సౌకర్యంగా ఉండటంతో పాటు సరసమైన ధరకే లభిస్తుందని, పచ్చని నగరాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు.