Page Loader
అద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు
OLA SI ఎలక్ట్రిక్ స్కూటర్

అద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి. తాజాగా ఈ స్కూటర్ డెలివరీలు జూలైలో ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది, దీని ధరలు రూ.84,999 నుండి ప్రారంభం కానున్నాయి. టాప్ వేరియంట్‌లు వరుసగా రూ.99,999, రూ.109,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2 kWh, 3 kWh, 4 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి.

Details

ఒక్కసారి ఛార్జీ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణం

ఈ వాహనం గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2 kWh, 3 kWh, 4 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. ఈ వాహనం గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 3 kWh, 4 kWh వాహనాలను ఒక్కసారి ఛార్జీ చేస్తే వరుసగా 125 కిమీ, 165 కిమీలు దూరం ప్రయాణించనున్నాయి. డిజైన్ పరంగా, Ola S1 ఎయిర్ S1, S1 ప్రోలకు సమానంగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్‌లలో లభిస్తుంది. కోరల్ గ్లామ్, నియో మింట్, పింగాణీ వైట్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో ఉంటుంది.