Page Loader
డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా 
డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా

డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా 

వ్రాసిన వారు Stalin
Oct 16, 2023
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కియా మోటర్స్ ఇండియా తన డీజిల్ వెర్షన్‌లోని సెల్టోస్, సోనెట్ వేరియంట్లను రీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం డీజిల్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(iMT)వేరియంట్‌ వాహనాలు విక్రయాలు తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. కియా ఇండియా సెల్టోస్, సోనెట్ వేరియంట్లను అప్‌గ్రేడ్ చేసి తిరిగి తీసుకురాబోతున్నారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను తిరిగి ప్రవేశపెట్టిన తర్వాత ఈ డీజిల్ మోడల్‌కు వచ్చే ఆదరణ చూసి కొనసాగించాలా? వద్దా? అనే దానిపై కంపెనీ నిర్ణయం తీసుకోనుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో .. పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచడానికి సెల్టోస్, సోనెట్ వేరియంట్లను తిరిగి ప్రారంభించాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.

వాహనం

మాన్యువల్ గేర్‌బాక్స్ బెస్ట్.. 

డీజిల్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (iMT) గేర్ బాక్స్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. iMT గేర్‌బాక్స్ ఉంటే, క్లచ్‌లెస్ గేర్‌షిఫ్ట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే చాలా ప్రావీణ్యం పొందిన డ్రైవర్లకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వినియోగదారులు మొదటి గేర్‌లో వేగవంతం చేసేటప్పుడు సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే, కొండ భూభాగం వంటి వాతావరణాలకు ఈ గేర్ తగినది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే iMT) గేర్ బాక్స్‌తో పోల్చితే, మాన్యువల్ గేర్‌బాక్స్ సౌకర్యవంతంగా ఉంటుంది. నియంత్రణ కూడా ఈజీగా ఉంటుంది. సోనెట్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను కూడా కియా ఇండియా ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించబడవచ్చు.