Oben Rorr Evo: ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో సంచలనం.. రూ.1 లక్షకే ఓబెన్ రోర్ ఎవో
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఓబెన్ రోర్ ఎవోను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన రేంజ్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తోంది. ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 180 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, ఈ ధర మొదటి 10,000మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ధర రూ.1.25 లక్షలకు పెరగనుంది. నీలం, ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. ఓబెన్ రోర్ ఎవోలో 3.4 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.
వివరాలు
పర్ఫార్మెన్స్ వివరాలు
దీనికి IP67 రేటింగ్ ఉండగా, బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీ అందిస్తున్నారు. కంపెనీ అభివృద్ధి చేసిన I-PMSM మోటార్‌ను ఇందులో ఉపయోగించారు. గరిష్ట పవర్: 9 kW వీల్ టార్క్: 250 Nm IDC రేంజ్: 180 కి.మీ. వాస్తవ రేంజ్: సుమారు 150 కి.మీ. గరిష్ట వేగం: 110 km/h 0 నుంచి 40 km/h వేగం: 5 సెకన్లు సస్పెన్షన్ విషయంలో ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ను అందించారు. భద్రత కోసం 270mm డిస్క్ బ్రేకులు, రెండు చక్రాలపై CBS (కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) ఏర్పాటు చేశారు.
వివరాలు
డిజైన్ & డైమెన్షనల్స్
సీటు ఎత్తు: 780 mm సీటు వెడల్పు: 680 mm గ్రౌండ్ క్లియరెన్స్: 200 mm మొత్తం బరువు: 140 kg కొత్త ఫ్రంట్ డిజైన్‌తో పాటు ప్రొజెక్టర్ హెడ్‌లైట్, హారిజాంటల్ DRLs, ఆల్-LED లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి స్మార్ట్ ఫీచర్లు ఈ బైక్‌లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఎకో, రోడ్, హావోక్, స్మార్ట్ IQ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లున్నాయి. ఇందులోని Smart IQ మోడ్ AI ఆధారంగా రైడింగ్ శైలిని విశ్లేషించి రేంజ్‌ను అంచనా వేస్తుంది. అదనంగా ఫాల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది.
వివరాలు
స్టోరేజ్ & ఛార్జింగ్
సీటు కింద 6 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ స్టోరేజ్: 4 లీటర్లు USB పోర్ట్స్: 2 ఛార్జింగ్: Oben Plug + 15A సాకెట్ సపోర్ట్ మొత్తానికి, స్టైలిష్ లుక్, మంచి రేంజ్, అధునాతన స్మార్ట్ ఫీచర్లతో Oben Rorr Evo ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పొచ్చు.