2026 Renault Duster : 2026 రెనాల్ట్ డస్టర్ బుక్ చేయాలా? ధరలు, డెలివరీ షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో 'రెనాల్ట్ డస్టర్' ఒకటి. కొన్నేళ్ల విరామం తర్వాత ఈ మోడల్ మళ్లీ భారత మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా రీ-డిజైన్ చేసిన స్టైలింగ్, అత్యాధునిక సాంకేతికత, సరికొత్త ఫీచర్లతో వచ్చిన 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భారత్‌లో క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లను విక్రయిస్తున్న రెనాల్ట్.. కొత్త డస్టర్‌తో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో తన వాటాను గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారుల కోసం కీలక వివరాలు ఇవే.
Details
2026 రెనాల్ట్ డస్టర్ - ధర, బుకింగ్స్, డెలివరీ వివరాలు
రెనాల్ట్ సంస్థ సోమవారం 2026 డస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసినప్పటికీ, ధరలను మాత్రం వెల్లడించలేదు. మార్చి నెలలో ధరలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రీ-బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి 'ఆర్ పాస్' కొనుగోలు చేయడం ద్వారా డస్టర్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయారిటీ డెలివరీ, ప్రారంభ ధరలపై ప్రత్యేక లాభాలు, బ్రాండెడ్ మర్చండైజ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ బుకింగ్స్‌ను అధికారిక రెనాల్ట్ షోరూమ్‌లలో గానీ, కంపెనీ ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా గానీ చేయవచ్చు. డెలివరీల విషయానికి వస్తే.. ఏప్రిల్ నుంచి 2026 రెనాల్ట్ డస్టర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Details
2026 రెనాల్ట్ డస్టర్ - ఇంజిన్ ఆప్షన్లు
టర్బోచార్జ్డ్ ఇంజిన్ వేరియంట్లు ఏప్రిల్ నుంచే అందుబాటులోకి రానుండగా, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే వేరియంట్ డెలివరీలు మాత్రం ఈ ఏడాది దీపావళి సమయంలో ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది. కొత్త డస్టర్ విస్తృత శ్రేణి పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తోంది. ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో టీసీఈ పెట్రోల్ ఇంజిన్ ఇది ఇప్పటికే రెనాల్ట్ కైగర్‌లో ఉపయోగిస్తున్న ఇంజిన్. ఇది గరిష్టంగా 101 హెచ్‌పీ పవర్, 160 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డస్టర్‌లో దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ శక్తివంతమైన మోటార్ 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 161 బీహెచ్‌పీ పవర్, 280 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
Details
1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ ఇంజిన్
ఈ వేరియంట్ 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. పవర్, టార్క్ గణాంకాలను రెనాల్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ డస్టర్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా నడపవచ్చని కంపెనీ ధృవీకరించింది. నగర పరిస్థితుల్లో దాదాపు 80 శాతం వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే డ్రైవ్ చేయవచ్చని రెనాల్ట్ వెల్లడించింది. కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ, విభిన్న ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన 2026 రెనాల్ట్ డస్టర్.. భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది.