Page Loader
టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ
టాటా Ace EV ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది

టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 11, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్‌ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది. టాటా Ace భారతదేశంలో దాదాపు 20 సంవత్సరాలు నుండి ఉంది. చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో 70% మార్కెట్ వాటాతో బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతుంది. ఈ మినీ ట్రక్ ఇప్పుడు పెట్రోల్, CNG, EV వంటి అన్ని వెర్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం EVకి చాలా డిమాండ్‌ కనిపిస్తోంది.

టాటా

టాటా Ace EV ధర దాదాపు రూ. 10 లక్షలు

టాటా Ace EV మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, రెండు సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో యుటిలిటేరియన్ క్యాబిన్‌ ఉన్నాయి. వెనుక పార్కింగ్ కెమెరా, డాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 36 హెచ్‌పి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో నడుస్తుంది. అధునాతన బ్యాటరీ శీతలీకరణ వ్యవస్థ, రీజెనరేటివ్ బ్రేకింగ్ డ్రైవింగ్ పరిధిని పెంచుతాయి. భారతదేశంలో టాటా Ace EV ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని మొదటి బ్యాచ్ అమెజాన్, Trent Limited, Delhivery, DHL, MoEVing, Safexpress, FedEx,ఫ్లిప్ కార్ట్, Johnson & Johnson కన్స్యూమర్ హెల్త్‌ వంటి సంస్థలకు డెలివరీ చేయబడింది.