Loading...
Tata Sierra EV: భద్రతలో టాటా సియెర్రా ఈవీ సూపర్‌హిట్ - సేఫ్టీ రూల్స్‌ అదుర్స్
భద్రతలో టాటా సియెర్రా ఈవీ సూపర్‌హిట్ - సేఫ్టీ రూల్స్‌ అదుర్స్

Tata Sierra EV: భద్రతలో టాటా సియెర్రా ఈవీ సూపర్‌హిట్ - సేఫ్టీ రూల్స్‌ అదుర్స్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్‌ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్‌ SUV Sierra EV భద్రత విషయంలో అదరగొట్టింది. భారత్‌ NCAP క్రాష్‌ టెస్టుల్లో ఈ SUVకి 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్ లభించింది. పెద్దల భద్రతలో 32కి 30.62 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించింది. టాప్‌-స్పెక్‌ Empowered 75kWh QWD వేరియంట్‌తో పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఈ రేటింగ్‌ RWD, AWDతో వచ్చే PURE, PURE S, ADV, EMP వేరియంట్లకు కూడా వర్తిస్తుంది.

Details

పెద్దల భద్రతలో మంచి స్కోర్

ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ క్రాష్‌ టెస్టులో డ్రైవర్‌, ముందు ప్రయాణికుడి తల, ఛాతీ, పొత్తికడుపు, తొడలకు మంచి రక్షణ లభించినట్లు పరీక్షల్లో తేలింది.

కాళ్ల భాగంలో కొన్ని చోట్ల రక్షణ స్థాయి తక్కువగా నమోదైంది. అయితే సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టుల్లో మాత్రం సియెర్రా ఈవీ మరింత మెరుగ్గా నిలిచింది.

సైడ్‌ మూవబుల్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌, సైడ్‌ పోల్‌ టెస్టుల్లో కీలక శరీర భాగాలకు మంచి రక్షణ లభించింది. పరీక్షించిన SUV బరువు 2,412 కిలోలు.

Details

పిల్లల సేఫ్టీలోనూ అదుర్స్

చిన్నారుల భద్రత విషయంలో Sierra EVకి మరో మంచి ఫలితం వచ్చింది.

18 నెలలు, 3 ఏళ్ల పిల్లల డమ్మీలను ఉపయోగించిన ఫ్రంటల్‌, సైడ్‌ ఇంపాక్ట్‌ పరీక్షల్లో పూర్తి మార్కులు సాధించింది.

చైల్డ్‌ రెస్ట్రెయింట్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాలేషన్‌లో 12కి 12 పాయింట్లు వచ్చాయి. వాహన మూల్యాంకనంలో నాలుగు మార్కులు కోల్పోవడంతో మొత్తం స్కోర్‌ 45/49గా నమోదైంది.

ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, సైడ్‌ కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, సీట్‌బెల్ట్‌ రిమైండర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ADVERTISEMENT

Details

బ్యాటరీ.. రేంజ్‌ కూడా ఆకట్టుకునేలా

Sierra EVని Tata Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించింది. ఇందులో 63kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి.

75kWh RWD వెర్షన్‌ MIDC ప్రకారం 665 కి.మీ, AWD వెర్షన్‌ 624 కి.మీ, 63kWh మోడల్‌ 535 కి.మీ రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

120kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో 15 నిమిషాల్లో 263 కి.మీ వరకు రేంజ్‌ పొందొచ్చని పేర్కొంది. AWD వెర్షన్‌ 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.8 సెకన్లలో అందుకుంటుందని టాటా తెలిపింది.

ADVERTISEMENT