Loading...
Tata Tiago EV: టాటా కార్లు కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లకు ఏకంగా 24 వారాల వెయిటింగ్!
టాటా కార్లు కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లకు ఏకంగా 24 వారాల వెయిటింగ్!

Tata Tiago EV: టాటా కార్లు కొనాలనుకుంటున్నారా? ఈ మోడళ్లకు ఏకంగా 24 వారాల వెయిటింగ్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. 2026 ఆగస్టులో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లోని పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ వెయిటింగ్ పీరియడ్లలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని మోడళ్లను కేవలం 1 నుంచి 2 వారాల్లోనే డెలివరీ చేస్తుండగా.. కొన్ని ఎలక్ట్రిక్ వేరియంట్ల కోసం ఏకంగా 24 వారాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం టాటా టిగోర్, ఆల్ట్రోజ్ కార్లు అత్యంత వేగంగా కస్టమర్లకు డెలివరీ అవుతున్నాయి. వీటి అన్ని పవర్‌ట్రెయిన్ వేరియంట్లకు 1 నుంచి 2 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. కర్వ్ ఈవీ కూడా ఇదే కేటగిరీలో ఉంది.

వివరాలు

CNG వేరియంట్లకు కూడా 1 నుంచి 2 వారాల వెయిటింగ్..

ఇక నెక్సాన్ పెట్రోల్, CNG వేరియంట్లకు కూడా 1 నుంచి 2 వారాల వెయిటింగ్ మాత్రమే ఉంది.

కర్వ్ పెట్రోల్‌కు కూడా ఇదే వెయిటింగ్ పీరియడ్ ఉండగా.. కర్వ్ డీజిల్ వేరియంట్ల కోసం 2 నుంచి 3 వారాలు వేచి ఉండాలి.

టాటా కార్లలో కొన్ని మోడళ్లకు మాత్రం డెలివరీ కోసం కాస్త ఎక్కువ సమయం పడుతోంది.

నెక్సాన్ డీజిల్, నెక్సాన్ ఈవీ మోడళ్లకు 3 నుంచి 4 వారాల వెయిటింగ్ ఉంది.

టియాగో పెట్రోల్, CNG Smart వేరియంట్లకు 10 నుంచి 12 వారాల వరకు వెయిటింగ్ ఉండగా.. ఇతర వేరియంట్లను 4 నుంచి 6 వారాల్లో డెలివరీ చేస్తున్నారు.

వివరాలు

10 నుంచి 12 వారాల వెయిటింగ్..

అలాగే పంచ్ పెట్రోల్, CNG Smart వేరియంట్లకు 10 నుంచి 12 వారాల వెయిటింగ్ ఉంది.

ఇతర పంచ్ వేరియంట్లకు 6 నుంచి 7 వారాల వరకు సమయం పడుతోంది.

సియెరా ICE పెట్రోల్ NA Smart వేరియంట్‌కు 6 నుంచి 8 వారాల వెయిటింగ్ ఉండగా.. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు 2 నుంచి 6 వారాల మధ్య వెయిటింగ్ ఉంది.

టాటా SUVల విషయానికి వస్తే.. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో డెలివరీ సమయాల్లో తేడా కనిపిస్తోంది.

హారియర్ పెట్రోల్, సఫారీ పెట్రోల్ వేరియంట్లకు 10 నుంచి 12 వారాల వెయిటింగ్ ఉంది.

అయితే వీటి డీజిల్ వేరియంట్లను మాత్రం 2 నుంచి 3 వారాల్లోనే డెలివరీ చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

టాటా కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ అదే..

హారియర్ ఈవీకి అన్ని వేరియంట్లలో 2 నుంచి 3 వారాల వెయిటింగ్ మాత్రమే ఉంది.

దీంతో టాటా లైనప్‌లో త్వరగా డెలివరీ అయ్యే ఎలక్ట్రిక్ SUVల్లో హారియర్ ఈవీ కూడా ఒకటిగా నిలిచింది.

టాటా కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ మాత్రం కొన్ని ఎలక్ట్రిక్ మోడళ్లకు ఉంది.

టియాగో EV Smart 19, Pure+ 19 వేరియంట్ల కోసం 18 నుంచి 24 వారాల వరకు వేచి చూడాలి.

ఇతర టియాగో EV వేరియంట్లను 4 నుంచి 6 వారాల్లో డెలివరీ చేస్తున్నారు.

ఇక పంచ్ EV Smart 30 వేరియంట్‌కు కూడా 18 నుంచి 24 వారాల వెయిటింగ్ ఉంది.

ADVERTISEMENT

వివరాలు

ఈ వేరియంట్ల గురించి తెలుసా?

Smart 40 వేరియంట్‌కు 10 నుంచి 12 వారాలు, ఇతర వేరియంట్లకు 8 నుంచి 10 వారాల వెయిటింగ్ ఉంది.

సియెరా EV Pure 65 వేరియంట్‌కు 12 నుంచి 15 వారాల డెలివరీ సమయం, ఇతర వేరియంట్లను 6 వారాల్లో డెలివరీ చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. 2026 ఆగస్టు నెలలో టాటా మోటార్స్ కార్ల వెయిటింగ్ పీరియడ్లలో పెట్రోల్, డీజిల్, CNG మోడళ్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

టియాగో EV, పంచ్ EVలోని కొన్ని వేరియంట్లకు 18 నుంచి 24 వారాల వరకు వెయిటింగ్ ఉండటం గమనార్హం.

అలాగే సియెరా EV Pure 65 వేరియంట్‌కు కూడా 12 నుంచి 15 వారాల వెయిటింగ్ ఉంది.

ADVERTISEMENT