టార్క్ క్రేటాస్ R, రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
రివోల్ట్ మోటార్స్ కంపెనీ RV400 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దీని ధర 1.55లక్షలుగా(ఎక్స్ షోరూమ్, ఛార్జర్ కూడా) ఉంది.
ధరలతో పోల్చి చూస్తే, టార్క్ క్రేటాస్ R తో పోటీకి వస్తోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య ఎలాంటి తేడాలున్నాయో చూడండి.
రీవోల్ట్ RV400 మోడల్ బైక్ లుక్, ఇండియా బ్లూ షేడ్ లో ఉంటుంది. దీని ఇంధన ట్యాంక్ ఆకారం ఆకర్షణీయంగా ఉంటుంది.
హ్యాండిల్ విశాలంగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, స్టెప్ అప్ సీట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి.
ఇక ట్రార్క్ క్రేటాస్ R ఇంధన ట్యాంక్ పెద్దగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ లైట్, వేరు పడిన సీట్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి.
Details
రెండు బైకుల మైలేజీ వివరాలు
RV400, టార్క్ క్రేటాస్ R బైక్స్ డిస్క్ బ్రేక్స్ కలిగి ఉన్నాయి. ఈ రెండు బైక్స్ మోనో షాక్ యూనిట్ ని కలిగి ఉన్నాయి.
3.24kWh బ్యాటరీ సామర్థ్యాన్ని RV400 బైక్ కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
4kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న టార్క్ క్రేటాస్ R బైక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఈ రెండు బైక్స్ లో ఏది కొనాలంటే?
ఇండియాలో రీవోల్ట్ RV400 బైక్, 1.55లక్షల రూపాయలకే దొరుకుతుంది.
అదే టార్క్ క్రేటాస్ R బైక్ ధర 1.37 లక్షల నుండి 1.67లక్షల మధ్య ఉంది. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ధరలని గుర్తుంచుకోవాలి.