
Sealion 7: ఈవీ ప్రపంచంలో కొత్త రారాజు.. సేఫ్టీ, రేంజ్ రెండింట్లోనూ సూపర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈక్రమంలో బహుళ జాతి కంపెనీలు భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తున్నాయి.
ఈ పోటీలో చైనా సంస్థ బీవైడీ (BYD) తన సీలియన్ 7 (Seal U 7) కారుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ కారును ప్రదర్శించిన తర్వాత, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దీన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.48.90 లక్షలుగా నిర్ణయించింది.
ఈ బీవైడీ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ఇటీవల యూరో NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5 స్టార్ భద్రతా రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ప్రయాణికుల భద్రతలో 87 శాతం, పిల్లల భద్రతలో 93 శాతం స్కోర్ చేసింది. ఇది వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచింది.
Details
రెండు వేరియంట్లలో అందుబాటులో
బీవైడీ సీలియన్ 7 ఎస్‌యూవీ ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది.
ప్రీమియం వేరియంట్ ధర : రూ.48.90 లక్షలు
పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర : రూ.54.90 లక్షలు
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ప్రీమియం వేరియంట్ 567 కి.మీ., పెర్ఫార్మెన్స్ వేరియంట్ 542 కి.మీ వరకు ప్రయాణించగలదు.
టాప్ ఫీచర్లు ఇవే
ఈ కారులో మొత్తం 11 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించారు.
ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Details
ఇంజిన్, పవర్
ప్రీమియం వేరియంట్ : సింగిల్ మోటార్, రియర్ వీల్ డ్రైవ్, 308 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్క్
పెర్ఫార్మెన్స్ వేరియంట్ : డ్యుయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్, 523 బీహెచ్‌పీ పవర్, 690 ఎన్ఎం టార్క్
ఇంటీరియర్, ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్‌ను అందించారు
ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్
10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
15.6-అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
నప్పా లెదర్ అప్‌హోల్స్టరీ
12-స్పీకర్ సౌండ్ సిస్టమ్
పనోరమిక్ సన్‌రూఫ్ - వెంటిలేటెడ్, ఎడ్జస్ట్ చేయగల ముందు సీట్లు
డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ - హెడ్-అప్ డిస్‌ప్లే