Page Loader
Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది
765 RS మార్కెట్లో డుకాటి మాన్‌స్టర్‌తో పోటీపడుతుంది

Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 10, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్‌సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 RS 2023 వెర్షన్ లాంచ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ మోడల్ ఇప్పుడు భారతదేశంలోని బ్రాండ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ మార్కెట్లో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో డుకాటి మాన్‌స్టర్‌తో పోటీపడుతుంది. లీటర్-క్లాస్ స్పీడ్ ట్రిపుల్ మోటార్‌సైకిల్ ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్‌గా వినియోగదారుల ముందుకు వస్తుంది. అయితే ఈ విభాగంలో డుకాటి మాన్‌స్టర్ తో పాటు, కవాస్కీ Z900, బి ఎం డబ్ల్యూ R1250 R వంటి బైక్ లు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో 2023 RS మోడల్ తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోవడం చాలా కష్టం.

బైక్

రైడర్ భద్రత కోసం రెండింటిలో డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి

2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS 765cc, 12-వాల్వ్, DOHC, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ట్రిపుల్ ఇంజిన్ తో నడుస్తుంది. డుకాటి మాన్‌స్టర్‌కు 937cc, L-ట్విన్ టెస్టాస్ట్రెట్టా లిక్విడ్-కూల్డ్ ఇంజన్ సపోర్ట్ ఉంది. రైడర్ భద్రత కోసం, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RS, డుకాటి మాన్‌స్టర్‌లలో డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థొరెటల్, రైడింగ్ మోడ్‌లతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. భారతదేశంలో, డుకాటి మాన్‌స్టర్ ధర రూ.12.49 లక్షలు నుండి రూ.12.59 లక్షలు, 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS దాదాపు రూ.12 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). మెరుగైన బ్రాండ్ విలువతో డుకాటి మాన్‌స్టర్ కొనడం మంచిది.