
Royal Enfield: వచ్చే ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న అదిరిపోయే బైక్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వచ్చే ఏడాది పలు కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ముఖ్యంగా 560 సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడానికి కూడా సన్నహాలను చేస్తోంది.
కావున వచ్చే ఏడాదిలో సరికొత్త ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకురానున్న మోటార్ సైకిళ్లపై ఓ లుక్కేద్దాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్ గన్ 650 ఇటీవలే మోటోవర్స్ ఎడిషన్ బైకును విడుదల చేసింది.
650 సీసీ సెగ్మెంట్‌లో కంపెనీ తీసుకురానున్న నాలుగో బైక్ ఇది.
ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, USBఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది.
Details
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 450 ధర రూ. 2.60 లక్షలు
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 450
450 కొత్త రోడ్‌స్టర్, హంటర్ 450తో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 450cc లైనప్‌ను విస్తృతం చేయాలని యోచిస్తోంది.
ఈ బైక్‌లో 452cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్- కూల్డ్, DOHC ఫోర్-వాల్వ్ ఇంజన్, 40.02hp, 40Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది.
దీని ప్రారంభ 650రూ. 2.60 లక్షల దాకా ఉండనుంది.
స్క్రాంబ్లర్ 650
650cc ఇంజిన్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తున్న ఐదో మోటార్ సైకిల్ స్క్రాంబ్లర్650.
ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ చేసిన ఈ బైక్‌ని వచ్చే ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి తీసుకొని రావాలని కంపెనీ యోచిస్తోంది.
స్పోక్స్ వీల్స్, డ్యుయల్ రియర్ షాక్స్, డ్యుయల్ పర్పస్ టైర్లతో ఈ ద్విచక్ర వాహనం రానుంది.