Vinfast India: భారత్‌లోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ.. సూపర్ కార్లతో సంచలనం!
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాం నుండి వెలువడిన ఆటో మొబైల్ కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. 2025లో భారతదేశంలో ఈ కంపెనీ తన ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
కంపెనీ ఇప్పటికే తన ఎంట్రీని కన్ఫర్మ్ చేసే టీజర్ విడుదల చేసింది. ఇందులో VF7 5-సీటర్, VF9 7-సీటర్ కార్లను పరిచయం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాలు
విన్‌ఫాస్ట్ భారతదేశం కోసం పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఈ కంపెనీ ఎస్‌యూవీలతో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్‌ను కూడా పేటెంట్ చేసింది.
విన్‌ఫాస్ట్ యొక్క గ్లోబల్ మోడల్ VF e34 ప్రస్తుతం భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మోడల్‌ను టీజర్‌లో చూపించలేదు.
Details
3 సంవత్సరాలలో ఈవీ ఉత్పత్తి
విన్‌ఫాస్ట్ భారతదేశం, ఇండోనేషియాలో ఉత్పత్తి ప్లాంట్‌లను స్థాపించే ప్రణాళికలను వెల్లడించింది. ఈ సంస్థ మూడు సంవత్సరాలలో ఈవీ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి ఐదేళ్లలో 500 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసే ప్రణాళికతో తమిళనాడులో తూత్తుకుడిలో బ్యాటరీ ప్లాంట్, తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయనుంది.
దీని ద్వారా 3,500 ఉద్యోగాలు సృష్టించేందుకు వీలు కలుగుతుందని అంచనా.
Details
VF7 ఫీచర్లు
VF7 75.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 5-సీటర్ ఎస్‌యూవీ. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసి 450 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది సింగిల్ లేదా డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో ఉంటుంది.
VF7 సింగిల్ మోటార్ సెట్‌అప్ 201 bhp, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్యూయల్ మోటార్ సెట్‌అప్ 348 bhp, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 15-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెవెల్-2 ADAS సూట్‌తో వస్తుంది.
Details
VF9 ఫీచర్లు
VF9 7-సీటర్ ఎస్‌యూవీ 123 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది బేస్ వేరియంట్‌లో 531 కిమీ, ప్లస్ వేరియంట్‌లో 468 కిమీ సింగిల్ ఛార్జ్ రేంజ్‌ను అందిస్తుంది.
ఈ SUV 6.6 సెకన్లలో 0-100 కిమీ/గం వేగం అందిస్తుంది. 200 కిమీ/గం వరకు వేగాన్ని చేరుకోవచ్చు. 35 నిమిషాల్లో 10 నుండి 70% వరకు ఛార్జ్ చేయవచ్చు.
15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 2-ADAS సాంకేతికతతో ఈ కారులో అదనపు భద్రతా లక్షణాలున్నాయి.
ఈ కొత్త మోడల్‌లు, విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరించడంలో కీలకంగా మారనున్నాయి.