కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్
గతంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన తెల్లటి రంగు ఆడి R8, మహారాష్ట్రలోని ఒక పోలీసు స్టేషన్ వెలుపల పాడుబడిన స్థితిలో గుర్తించారు. 2012లో ఈ R8 మోడల్ సూపర్‌కార్ ను కోహ్లి కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ 2015 నుండి భారతదేశంలో ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆడికి అభిమాని అందుకే 2012 నుండి R8 సూపర్‌కార్‌ను నడుపుతున్నాడు. R8 రెండవ తరం మోడల్‌ను కొన్న తర్వాత, పాత సూపర్‌కార్‌ను సాగర్ థక్కర్ అకా షాగీకి కార్ బ్రోకర్ ద్వారా 2016లో సుమారు రూ. 2.5 కోట్లకు అమ్మారు. యాజమాన్య బదిలీ పూర్తికాకముందే థానే క్రైమ్ బ్రాంచ్ కారును సీజ్ చేసింది.
2013 నుండి దాదాపు 15,000 అమెరికా పౌరులు వీరి చేతిలో మోసపోయారు
క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, థక్కర్ సూత్రధారిగా రూ. 500 కోట్ల నకిలీ కాల్ సెంటర్ కుంభకోణం, ఇందులో అమెరికాకు చెందిన పన్ను చెల్లింపుదారులు అమెరికన్ పన్ను, ఇమ్మిగ్రేషన్ అధికారులుగా చూపుతూ కాలర్‌ల ద్వారా కాజేశారు. 2013 నుండి దాదాపు 15,000 అమెరికా పౌరులు వీరి చేతిలో మోసపోయారు. మహారాష్ట్రలోని థానేలో మీరా రోడ్ దాని పరిసర ప్రాంతాల్లో అర డజను కాల్ సెంటర్ల ద్వారా ఈ ఆపరేషన్ అమలు చేశారు. థానే పోలీసులు దీనిని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, ఆడి R8 చాలా దారుణమైన స్థితిలో ఉంది. నివేదికల ప్రకారం, సూపర్‌కార్ ఓపెన్ గ్రౌండ్‌లో ఎటువంటి షెల్టర్ లేకుండా పార్క్ చేశారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల తర్వాత పూర్తిగా దెబ్బతింది.