Page Loader
విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

విరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ 1205 రోజుల తర్వాత ఎట్టకేలకు సెంచరీని నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీ 186 పరుగులు చేశారు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ 28వ సెంచరీని నమోదు చేశాడు. అతని చివరి టెస్ట్ సెంచరీకి, ఈ సెంచరీకి మధ్య 41 ఇన్నింగ్స్‌ల గ్యాప్ ఉంది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై ఓ సెంచరీని సాధించాడు.

విరాట్ కోహ్లీ

రిషబ్ పంత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలి

విరాట్ ప్రపంచ స్థాయి ఆటగాడని, అతను ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరుగులు చేయగత సత్తా ఉందని పాల్ కాలింగ్‌వుడ్ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరిట 75 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ అత్యుత్తమ బ్యాటర్ అని, అతను ఆటను మలుపు తిప్పే సామర్థ్యం ఉందని, దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురయ్యాడని, అతని తిరిగి మైదానంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాల్ కాలింగ్‌వుడ్ వెల్లడించారు.