LOADING...
Volvo EX60 EV : జెమిని AIతో వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. మనిషిలా మాట్లాడే సూపర్ స్మార్ట్ ఎస్‌యూవీ!
జెమిని AIతో వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. మనిషిలా మాట్లాడే సూపర్ స్మార్ట్ ఎస్‌యూవీ!

Volvo EX60 EV : జెమిని AIతో వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. మనిషిలా మాట్లాడే సూపర్ స్మార్ట్ ఎస్‌యూవీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ జెమిని ఏఐతో నడిచే ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. వోల్వో సంస్థ రూపొందించిన ఈ సూపర్‌-స్మార్ట్ ఏఐ కారు ఆటోమొబైల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. గూగుల్ జెమిని ఏఐ ఆధారంగా రూపొందించిన వోల్వో మిడ్‌రేంజ్ ఎలక్ట్రిక్ SUV 'EX60'ను కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. జనవరి 21, 2026 నుంచి ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. వోల్వో EX60 కేవలం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే కాదు. రోడ్లపై నడిచే సూపర్ కంప్యూటర్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఏ కారులోనూ లేని అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఈ వాహనం వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందింది.

Details

మీతో మాట్లాడే ఏఐ కారు

ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కారు చేయలేని అనేక టాస్కులను ఈ ఏఐ కారు చేయగలగడం విశేషం. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ గూగుల్ జెమిని ఏఐ. ఇది సాధారణ వాయిస్ అసిస్టెంట్‌లా కాకుండా, మనిషిలా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇప్పటివరకు కార్లలో బటన్లు నొక్కడం లేదా కొన్ని పరిమిత ఆదేశాల ద్వారానే పనులు జరిగేవి. కానీ వోల్వో EX60లో కారులోని అనేక ఫంక్షన్లను జెమిని ఏఐ పూర్తిగా నియంత్రిస్తుంది. ఏసీ ఆన్ చేయడం నుంచి ఆఫ్ చేయడం వరకు అన్ని కమాండ్లను మీ మాటలతోనే చెప్పవచ్చు. మీరు మాట్లాడే ప్రతి పదాన్ని అర్థం చేసుకుని సరైన స్పందన ఇవ్వగల సామర్థ్యం ఈ ఏఐకి ఉంది.

Details

జీమెయిల్, క్యాలెండర్ ఇంటిగ్రేషన్

ఈ కారు మీ జీమెయిల్ క్యాలెండర్‌తో నేరుగా ఇంటిగ్రేట్ అవుతుంది. డ్రైవింగ్ చేస్తూనే మీ మీటింగ్స్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ఇమెయిల్‌లో వచ్చిన అడ్రస్‌ను నావిగేషన్‌లో ఆటోమేటిక్‌గా ఎంటర్ చేయవచ్చు. డ్రైవింగ్ సమయంలో మీ షెడ్యూల్ వివరాలను ఏఐ మీకు చదివి వినిపిస్తుంది. భవిష్యత్ అంతా ఏఐదే అన్నట్టుగా, ఈ కారులో 360 డిగ్రీ కెమెరాలు అమర్చారు. అవి బయట ఉన్న భవనాలు, పరిసరాలను గుర్తించగలవు. మీరు "ఇది ఏ భవనం?" అని అడిగితే, ఏఐ వెంటనే సమాధానం ఇస్తుంది. కంటి రెప్పలో డేటాను ప్రాసెస్ చేసే టెక్నాలజీతో పాటు NVIDIA, క్వాల్‌కామ్ సంస్థల సూపర్-ఫాస్ట్ చిప్‌లను ఇందులో ఉపయోగించారు.

Advertisement

Details

బ్యాటరీ, రేంజ్, పనితీరు

వోల్వో EX60ను కొత్త 'SPA3 800-వోల్ట్ ప్లాట్‌ఫామ్'పై రూపొందించారు. ఇది గత మోడళ్ల కంటే వేగంగా పవర్ డెలివరీ అందిస్తుంది. ఈ కారు మూడు వేరియంట్లలో లభిస్తోంది. P6 (RWD): ఎంట్రీ లెవల్ మోడల్. 374 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. 80kWh బ్యాటరీతో 620 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. P10 (AWD) : ఆల్ వీల్ డ్రైవ్ మోడల్. 503 హార్స్‌పవర్ శక్తి కలిగి ఉంటుంది. 91kWh బ్యాటరీతో పూర్తి ఛార్జ్‌లో 720 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. P12 (AWD) : ఫ్లాగ్‌షిప్ మోడల్. 670 హార్స్‌పవర్ అద్భుతమైన శక్తిని అందిస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్టంగా 810 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

Advertisement

Details

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

ఈ కారులో 400kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాల్లో ఛార్జ్ చేసి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే వెహికల్ టు హోమ్ (V2H) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్లో లైట్లు, అవసరాలకు ఈ కార్ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. ఇంటీరియర్, ఇతర ఫీచర్లు వోల్వో EX60లో 15 అంగుళాల భారీ OLED స్క్రీన్, బోవర్స్ & విల్కిన్స్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అందించారు. టెస్లా సూపర్‌చార్జర్‌కు అనుకూలమైన 'NACS పోర్ట్' కూడా ఉంది. మెగా-కాస్టింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారు బలంగా ఉండటంతో పాటు తక్కువ బరువుతో ఉంటుంది.

Details

బుకింగ్స్ ఎప్పటి నుంచి?

యూరప్‌లో ఇప్పటికే ఈ కారు కోసం ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 2026 సమ్మర్ నాటికి అమెరికాలో బుకింగ్స్ మొదలుకానున్నాయి. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఏఐ ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు వోల్వో EX60 ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనుంది.

Advertisement