Loading...
8th Pay Commission: 8వ పే కమిషన్‌ నివేదిక ఎప్పుడు? 18 నెలల గడువుపై కేంద్రం ఏం చెప్పింది?
8వ పే కమిషన్‌ నివేదిక ఎప్పుడు? 18 నెలల గడువుపై కేంద్రం ఏం చెప్పింది?

8th Pay Commission: 8వ పే కమిషన్‌ నివేదిక ఎప్పుడు? 18 నెలల గడువుపై కేంద్రం ఏం చెప్పింది?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

8వ వేతన సంఘం సిఫార్సుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న వేళ.. 18 నెలల గడువుపై వస్తున్న వార్తలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం 8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission) సంప్రదింపుల దశలో ఉంది. ఇప్పటివరకు కమిషన్‌ నివేదికను కేంద్రానికి సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అలాగే ముందుగానే నివేదిక ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. 18 నెలల గడువు ఎప్పుడు ముగుస్తుంది? 8వ కేంద్ర వేతన సంఘాన్ని 2025 నవంబర్‌ 3న అధికారికంగా ఏర్పాటు చేశారు. కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చారు. దీని ప్రకారం 2027 మే నాటికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ముందస్తు గడువును ప్రకటించలేదు.

వివరాలు 

కేంద్రం ఏం చెప్పింది?

కాబట్టి 2027 మేనే ప్రస్తుతం అధికారికంగా ఉన్న గడువుగా చెప్పొచ్చు.

ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో కీలక విషయాలను వెల్లడించింది.

కమిషన్‌ ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోపు తన సిఫార్సులను అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

అయితే, ఇప్పటివరకు కమిషన్‌ తన సిఫార్సులను సమర్పించలేదని స్పష్టం చేసింది.

18 నెలల గడువు పూర్తికాకముందే నివేదిక సమర్పిస్తుందా? అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుతానికి 2027 మేనే నివేదికకు సంబంధించిన అధికారిక గడువుగా ఉంది.

అంతేకాదు.. కమిషన్‌ తన పురోగతిపై కేంద్రానికి క్రమం తప్పకుండా నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

వివరాలు 

ప్రస్తుతం ఏం చేస్తోంది?

కమిషన్‌ తన విధివిధానాలను స్వతంత్రంగా నిర్ణయించుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ తనకు నిర్దేశించిన విధివిధానాలకు (Terms of Reference) అనుగుణంగా ఉండాలి.

8వ వేతన సంఘం ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, ఇతర వర్గాల ప్రతినిధులతో కమిషన్‌ సమావేశాలు నిర్వహిస్తోంది.

రాబోయే రోజుల్లో జైపుర్‌, చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్‌ వంటి నగరాల్లోనూ సంప్రదింపులు నిర్వహించనుంది.

8వ పే కమిషన్‌ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి?

వేతన స్కేళ్ల సవరణ,కరవు భత్యం (DA),ఇతర అలవెన్సులు,పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌, ఉద్యోగ సేవకు సంబంధించిన నిబంధనల సవరణ వంటి అంశాలు 8వ వేతన సంఘం పరిధిలో ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎంతమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం పడొచ్చు?

అయితే ఈ సిఫార్సుల వల్ల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు వచ్చే మొత్తాల్లో ఎంత మార్పు వస్తుందనే విషయాన్ని కేంద్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.

ఈ ప్రక్రియతో దాదాపు 70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సివిలియన్‌ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

2026 మార్చి 1 నాటికి సుమారు 35.77 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

అలాగే 2025 డిసెంబర్‌ 31 నాటికి 33.76 లక్షల మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు. ఈ సంఖ్యలో రక్షణ శాఖ పెన్షనర్లు లేరు.

ADVERTISEMENT

వివరాలు 

సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?

8వ వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంపై కేంద్రం ఇంకా ఎలాంటి తేదీని ప్రకటించలేదు.

కమిషన్‌ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి, అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

ప్రస్తుతం 2027 మేనే కీలక తేదీగా ఉంది. 18 నెలల గడువు పూర్తయ్యేలోపు కమిషన్‌ నివేదిక సమర్పిస్తుందా? లేక అంతకంటే ముందే ఇస్తుందా? అనే దానిపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT