Loading...
IND vs AFG: సెప్టెంబరు 14న టీ20.. భారత్‌తో సిరీస్‌ షెడ్యూల్‌పై అఫ్గాన్ కొత్త ప్లాన్!
సెప్టెంబరు 14న టీ20.. భారత్‌తో సిరీస్‌ షెడ్యూల్‌పై అఫ్గాన్ కొత్త ప్లాన్!

IND vs AFG: సెప్టెంబరు 14న టీ20.. భారత్‌తో సిరీస్‌ షెడ్యూల్‌పై అఫ్గాన్ కొత్త ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబరులో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి. అయితే తమ దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా చాలాకాలంగా హోమ్ సిరీస్‌లను భారత్‌లోనే నిర్వహిస్తున్న అఫ్గానిస్థాన్.. ఈసారి భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు గురువారం సమాచారం వెలువడింది.

వివరాలు

బీసీసీఐ అంగీకారం తప్పనిసరి

ప్రస్తుత షెడ్యూల్‌లో మార్పులు చేసి తొలి లేదా రెండో టీ20ని సెప్టెంబరు 14న నిర్వహించాలని అఫ్గాన్ బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబరు 14న వినాయక చవితి ఉండటంతో సెలవుదినం కానుంది. దీంతో మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అఫ్గాన్ బోర్డు భావిస్తోంది.

అంతేకాకుండా పండగ రోజు మ్యాచ్ కావడంతో టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వీక్షణలు కూడా పెరిగే అవకాశం ఉందని అఫ్గాన్ క్రికెట్ బోర్డు అంచనా వేస్తోంది.

షెడ్యూల్‌లో మార్పు ప్రతిపాదనను అఫ్గాన్ ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ మార్పు అమల్లోకి రావాలంటే బీసీసీఐ అంగీకారం తప్పనిసరి. భారత బోర్డు ప్రతిపాదనకు సమ్మతిస్తేనే భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ADVERTISEMENT