Loading...
Aishwarya Rai Simone Ashley Reunite: ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యారాయ్‌ సందడి.. సిమోన్‌ యాష్లీతో స్పెషల్‌ మూమెంట్‌!
ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యారాయ్‌ సందడి.. సిమోన్‌ యాష్లీతో స్పెషల్‌ మూమెంట్‌!

Aishwarya Rai Simone Ashley Reunite: ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యారాయ్‌ సందడి.. సిమోన్‌ యాష్లీతో స్పెషల్‌ మూమెంట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ (Paris Fashion Week)లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) సందడి చేశారు. 'లోరియల్ ప్యారిస్‌' నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె తన లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇదే వేదికపై ప్రముఖ హాలీవుడ్‌ 'బ్రిడ్జర్టన్‌' వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ నటి సిమోన్‌ యాష్లీ (Simone Ashley)ని ఐశ్వర్యారాయ్‌ కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఫ్యాషన్‌ షో ముగింపు సందర్భంగా జరిగిన ఫైనల్‌ ర్యాంప్‌ వాక్‌లోనూ ఐశ్వర్య, సిమోన్‌ చేతులు పట్టుకుని కలిసి నడవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

'సిస్టర్లీ వైబ్స్‌' అంటూ కామెంట్లు

కాగా.. బ్రిటిష్‌ నటి సిమోన్‌ యాష్లీకి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వెళ్లింది.

ఐశ్వర్యారాయ్‌, సిమోన్‌ యాష్లీ ఇద్దరూ 'లోరియల్‌' బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే వీరిద్దరూ ప్రతి ఏడాది ఈ ఫ్యాషన్‌ షోలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు.

ఐశ్వర్యారాయ్‌, సిమోన్‌ యాష్లీ కలిసి కనిపించిన ప్రతిసారీ అభిమానులు ప్రత్యేకంగా స్పందిస్తుంటారు.

వీరిద్దరినీ చూస్తుంటే సొంత అక్కాచెల్లెళ్లలా ఉన్నారంటూ.. 'సిస్టర్లీ వైబ్స్‌' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT