Rajinikanth Dharman: సూపర్‌స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్‌లో తెలుగు స్టార్ హీరో!
ఈ వార్తాకథనం ఏంటి
'సూపర్‌స్టార్' రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ధర్మన్'పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం 'ధర్మన్' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని కూడా భాగమైనట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోతో 'ధర్మన్'లో రామ్ పోతినేని నటిస్తున్న విషయం ఖాయమైంది. ఇప్పటివరకు ప్రచారానికి, రూమర్లకే పరిమితమైన వార్తలు.. తాజాగా నిజమని తేలిపోయాయి.
వివరాలు
రజినీకాంత్‌కు రామ్ పోతినేని విలన్‌గా?
'ధర్మన్'లో రామ్ పోతినేని విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఆయన పోషించబోయే పాత్రలో విలన్ ఛాయలు ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి ప్రతినాయకుడిగా ఉండదని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో రాశి ఖన్నా సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తెగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రేమికుడి పాత్రను రామ్ పోతినేని పోషిస్తున్నట్లు సమాచారం.
దీంతో రజినీకాంత్, రామ్ పోతినేని, రాశి ఖన్నా కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
రామ్ ఇంతకుముందు హీరోగా నటించిన సినిమాలతో పోలిస్తే.. 'ధర్మన్'లో ఆయన పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ పాత్రపై రామ్ అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది.
వివరాలు
ప్రేమ, కుటుంబం.. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్'లో రజినీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
సిమ్రాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, కుటుంబ అంశాలతో పాటు రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదం, యాక్షన్ అంశాలను మేళవిస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
'ధర్మన్'ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా మైసూర్ లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.