Loading...
Iran: క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్ రహస్య తరలింపు.. ఇరాన్ ఎద్దేవా
క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్ రహస్య తరలింపు.. ఇరాన్ ఎద్దేవా

Iran: క్యాటరింగ్‌ ట్రక్కులో ట్రంప్ రహస్య తరలింపు.. ఇరాన్ ఎద్దేవా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని చూసి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో తెలియజేసే ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తుర్కియే పర్యటనలో ఉన్న సమయంలో ప్రాణభయంతో ఆయన రహస్యంగా విమానం మారాల్సి వచ్చింది. ఈ ఘటనను ఇరాన్ మీడియా తనకు అనుకూలంగా మలుచుకుని.. ట్రంప్‌కు ఇది అవమానకర పరిణామమంటూ తీవ్రంగా విమర్శిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

అసలేం జరిగింది?

గత నెల 8న తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు.

అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలోనే ఈ రహస్య ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'పై షోల్డర్-ఫైర్డ్ క్షిపణితో దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు స్పష్టమైన సమాచారం అందింది.

దీనికితోడు ట్రంప్ అంకారాలో బస చేసిన హోటల్‌లో ఆయన ఏ అంతస్తులో ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారం కూడా ఇరాన్‌కు చేరినట్లు అమెరికా అధికారులు గుర్తించారు.

ఈ విషయం భద్రతా వర్గాలను మరింత ఆందోళనకు గురిచేసింది. హెచ్చరికను అత్యంత తీవ్రంగా పరిగణించిన సీక్రెట్ సర్వీస్.. వెంటనే ప్రత్యేక చర్యలకు దిగింది.

వివరాలు 

క్యాటరింగ్ ట్రక్కులో తరలింపు

ఈ ఆపరేషన్‌లో భాగంగా ట్రంప్‌తో పాటు ఆయనకు చెందిన కొద్దిమంది సహాయకులను క్యాటరింగ్ ఫుడ్ ట్రక్కులోకి ఎక్కించారు.

అక్కడి నుంచి వారిని ఎయిర్ ఫోర్స్ వన్‌కు దూరంగా తీసుకెళ్లారు.

అనంతరం ప్రత్యేక గుర్తులు లేని చిన్న ప్రభుత్వ జెట్ C-32Aలోకి ట్రంప్‌ను మార్చి తుర్కియే నుంచి తరలించినట్లు సమాచారం.

ఇదే సమయంలో వైట్ హౌస్ అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్న అసలైన ఎయిర్ ఫోర్స్ వన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా బయలుదేరింది.

ఈ మొత్తం రహస్య ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను 'వాషింగ్టన్ పోస్ట్' తొలిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

ట్రంప్‌పై ఇరాన్ మీడియా ఎద్దేవా

ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా మాత్రం ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఎద్దేవాలతో కూడిన కథనాలను ప్రసారం చేస్తోంది.

"ఇరాన్ సైనిక శక్తిని చూసి ట్రంప్ ఎంతగా భయపడ్డారంటే.. చివరకు విమానం కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు జరిగిన అవమానం" అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ వ్యాఖ్యాత వ్యాఖ్యానించారు.

మరోవైపు టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో ట్రంప్‌ను శవపేటికలో ఉన్నట్లు, సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపించే భారీ హోర్డింగ్‌లు, పోస్టర్లు కనిపించాయి.

ఈ ప్రచారం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర శత్రుత్వాన్ని మరోసారి స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

క్యాటరింగ్ బాక్సులో ట్రంప్.. ఇరాన్ రాయబార కార్యాలయం మీమ్

దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. "త్వరలోనే ట్రంప్‌ను ఓ చెత్తబుట్టలో దాచిపెడతాం" అంటూ ఓ మీమ్‌ను 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

అందులో ట్రంప్ క్యాటరింగ్ బాక్సులో ఉన్నట్లుగా చిత్రీకరించారు. ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

వివరాలు 

మరింత పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

తమ గత సుప్రీం లీడర్‌ను అమెరికా హతమార్చిందని ఆరోపిస్తున్న ఇరాన్.. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇప్పటికే శపథం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా నిలిచిపోయాయి.

ఇక 2018లో ఇరాక్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ తనకు ఎదురైన భద్రతా పరిస్థితులను ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

వివరాలు 

మరింత పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

ఆ సమయంలో తాను ప్రయాణించిన విమానం కిటికీలన్నీ మూసివేసి, లైట్లు కూడా ఆర్పేసి పూర్తిగా చీకటిలో ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన రహస్య విమాన మార్పు ఘటన.. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర శత్రుత్వం, పరస్పర అనుమానాలు, భద్రతాపరమైన ఆందోళనలకు అద్దం పడుతోంది.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్యాటరింగ్ బాక్సులో ట్రంప్

ADVERTISEMENT