
Budget 2024 : 50కోట్ల మందికి శుభవార్త.. పెరగనున్న కనీస వేతనం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేసపెట్టనున్నారు.
అయితే ఈ బడ్జెట్‌లో దేశంలోని 50 కోట్ల మంది కార్మికులకు లాభం చేకూర్చే నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దాదాపు ఆరేళ్ల తర్వాత.. ఈ బడ్జెట్‌లో కేంద్రం కనీస వేతనం పెంచవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే జరిగితే కోట్లాది కార్మికులు, చిరుద్యోగుల లాభం చేకూరనుంది.
మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. కేంద్రం కనీస వేతనాలు పెంచితే.. ఇది రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుంది.
బడ్జెట్
2017లో చివరిసారిగా వేతన సవరణ
దేశంలో కనీస వేతన సవరణ చివరిసారిగా 2017లో జరిగింది. అప్పటి నుంచి మళ్లీ కనీస వేతనం పెంచలేదు.
అయితే.. కనీస వేతనాన్ని పెంచే విషయంపై 2021లో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఎస్పీ ముఖర్జీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ బడ్జెట్‌కు ముందు రిపోర్టును సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో కనీస వేతనం పెంచవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎస్పీ ముఖర్జీ కమిటీ ఇప్పటికే వేతన సవరణకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేశారు.
ఈ కమిటీ చివరి సారిగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి.. ఆ తర్వాత వెంటనే రిపోర్టును కేంద్రానికి అందించనుంది.