భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్
ఈ వార్తాకథనం ఏంటి
డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
ప్రపంచంలోనే ఈ ఎయిర్ ఫ్రైట్ సదుపాయాన్ని పొందిన మూడో దేశం భారత్. అమెజాన్ ఎయిర్ 2016లో USలో ప్రారంభమైంది, ఆ తర్వాత UKలో ఈ సంస్థ ఎయిర్ లాజిస్టిక్స్‌లో వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ సేవ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 70 గమ్యస్థానాలలో 110కి పైగా సరుకు రవాణా విమానాలను నడుపుతోంది.
అమెజాన్
ఒకే ఒక్క బోయింగ్ విమానంతో భారతదేశంలో ఈ సేవ ప్రారంభమవుతుంది
క్విక్‌జెట్ ద్వారా ఒకే ఒక్క బోయింగ్ 737-800 విమానంతో భారతదేశంలో ఇది ప్రారంభమవుతుంది. తరువాత 20,000 ప్యాకేజీల సామర్థ్యంతో రెండు విమానాలను నడపాలనే ఆలోచనతో ఉంది.
అమెజాన్ భారతదేశంలో $ 6.5 బిలియన్లను పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు అమెజాన్ కు ప్రత్యేకమైన సరుకు రవాణా విమానాలు ఉన్నాయి కాబట్టి, డెలివరీలు మరింత వేగంగా జరుగుతాయి. సాయంత్రం సమయంలో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను మరుసటి రోజు డెలివరీ చేసేస్తుంది.
మెట్రో నగరాల్లోని కస్టమర్ల కోసం డెలివరీ సమయాలను మెరుగుపరచడానికి అమెజాన్ ఎయిర్ ఇక్కడ అవసరం. అమెజాన్ తన రవాణా, లాజిస్టిక్స్ సేవలను భారతదేశంలోని ఇతర ఇ-కామర్స్ సంస్థలకు గత సంవత్సరం ప్రారంభించింది. అయితే, ఎయిర్‌ను అమెజాన్ తన సొంత డెలివరీల కోసం మాత్రమే ఉపయోగిస్తుంది.