హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు. అమెరికా, యూరప్ తర్వాత ఎయిర్ సేవలను అమెజాన్ తెలంగాణలోనే ప్రారంభించడం గమనార్హం. ఇందుకోసం అమెజాన్ బెంగళూరుకు చెందిన క్విక్ జెట్‌తో సంస్థతో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ఒక ఈ కామర్స్ సంస్థ థర్డ్ పార్టీ సేవలను వినియోగించడం కూడా ఇదే తోలిసారి కావడం గమనారం. 2016లో తొలిసారిగా అమెజాన్ తన ఎయిర్ సేవలను అమెరికాలో ప్రారంభించింది. తర్వాత యూకేకు ఆసేవలను విస్తరించింది. ఇప్పుడు మూడో కేంద్రంగా తెలంగాణను ఎంచుకుంది.
అమెజాన్ కార్యకలాపాలకు పూర్తి సహకారం అందిస్తాం: కేటీఆర్
అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించడం రాష్ట్ర, భారత విమానయాన, భారతీయ ఈ-కామర్స్ పరిశ్రమలకు మైలురాయి వంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమెజాన్ కార్యకలాపాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్‌కు హైదరాబాద్‌లోనే ఉందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ హైదరాబాద్‌లో రూ.36,300 కోట్లు పెట్టుబడి పెట్టాలనుకోవడం అభినందనీయం అన్నారు. లాజిస్టిక్ రంగ్లంంలో రాష్ట్రం సాధించిన విజయాల గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఇచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం సంపాదించిందని అన్నారు.