NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
    భారతదేశం

    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 23, 2023, 03:12 pm 0 నిమి చదవండి
    హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
    హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

    ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు సందర్శించింది. రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు ప్రయాణించారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడిన కమిటీకి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో పాటు ఎల్అండ్‌టీ ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి మెట్రో రైలు గురించి వివరించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ మెట్రో సాధించిన మైలురాళ్ల గురించి ఎంపీలకు వారు చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టుగా పీపీపీ విధానంలో నిలిచిందని, ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎన్‌వీఎస్‌ రెడ్డి కమిటీ సభ్యులకు తెలియజేశారు.

    ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ విశేషాలను వివరించిన ఎన్‌వీఎస్ రెడ్డి

    అమీర్‌పేట్ స్టేషన్‌లోని షాపింగ్ మాల్, ఇతర సౌకర్యవంతమైన దుకాణాలను హౌసింగ్, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులకు దగ్గరుండి చూపించారు. ఇవి ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు మెట్రో యాజమాన్యానికి ఆదాయాన్నికూడా సమకూరుస్తుడటంపై సభ్యులు ప్రశంసించారు. 100శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ విశేషాలను కూడా ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. సర్వే, ఇతర ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టును గ్రౌండింగ్ చేస్తామని ఆయన సభ్యులకు ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ మెట్రోను సందర్శించిన వారిలో ఆర్ గిరిరాజన్, రామ్ చందర్ జాంగ్రా, కవితా పటీదార్, బెన్నీ బెహనన్, శంకర్ లాల్వానీ, మసూది తదితరులు ఉన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    హైదరాబాద్

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    హైదరాబాద్

    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ
    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా వీసాలు
    ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి తెలంగాణ
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం తెలంగాణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023