LOADING...
NASA: నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..
నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..

NASA: నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)కు చెందిన ఒక రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌ పని చేయకపోవడంతో నేరుగా భూమిని తాకింది. ఈ సమయంలో విమానం నుంచి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌గా మారాయి. నాసాకు చెందిన డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పైలట్లు అప్రమత్తమై హ్యూస్టన్‌లోని ఎల్లింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దింపారు. ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపు తప్పి రన్‌వేపై ఒక వైపుకు ఒరిగిపోయింది. దీంతో విమానం వెనుక భాగం నుంచి మంటలు చెలరేగాయి.

వివరాలు 

అగ్నిమాపక చర్యలతో మంటలు అదుపులోకి..

వెంటనే ఎయిర్‌పోర్టు రెస్క్యూ, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. అగ్నిమాపక చర్యలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సహకారంతో పైలట్‌ కాక్‌పిట్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డాడని స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నాసా అధికారులు కూడా ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరించారు. విమానంలోని సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు నాసా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాసా డబ్ల్యూ-57 రీసెర్చ్‌ విమానం ల్యాండింగ్‌ గేర్‌లో సాంకేతిక లోపం

Advertisement