సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఆరు అంతస్తుల భవనంలో కింద గోదాం, పైన్ స్పోర్ట్స్ షోరూం ఉంటుంది. ఈ క్రమంలో ఉదయం 11గంటల సమయంలో గోదాంలో మంటల చెలరేగాయి. ఆ మంటలు పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచగా.. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనుమతులు లేని గోదాముల నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చించారు.
ఏక్షణమైనా భవనం కూలిపోవచ్చు: ఈవీడీఎం డైరెక్టర్
ఉదయం నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేంందుకు ప్రయత్నిస్తున్నా.. అవి అదుపులోకి రావడం లేదు. పైగా మంటలు పక్క భవనాలకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చుట్టుపక్కన ఉన్న దుకాణాలను పోలీసులు ఖాళీ చేయించారు. స్పోర్ట్స్ షోరూంలో రబ్బర్, చెక్క వస్తువులు అధికంగా ఉండటం వల్లే మంటలు అంతకంతకూ ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ భవనం నలువైపులా అగ్నికీలల ఎగిసిపడుతున్నట్లు, ఏక్షణమైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ చెప్పారు. ఒకవేళ భవనం కూలినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.