Page Loader
కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు
తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు

కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు

వ్రాసిన వారు Stalin
Jan 20, 2023
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వెళ్లిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఆ సంస్థతో చర్చలు జరపడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కార్పొరేషన్ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ ప్రధానంగా నాలుగు విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్, ఎంటర్‌ప్రైజ్ డేటా విభాగాల్లో ఇది పనిచేస్తోంది.

కేటీాఆర్

ఇన్‌స్పైర్ బ్రాండ్స్ కంపెనీకి 70 దేశాల్లో 32వేల శాఖలు

40బిలియన్ డాలర్ల విలువ గల ఇన్‌స్పైర్ బ్రాండ్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో 32,000 శాఖలు ఉన్నాయి. అర్బీస్, బాస్కిన్-రాబిన్స్, బఫెలో వైల్డ్ వింగ్స్, డంకిన్, జిమ్మీ జాన్స్, రస్టీ టాకో, సోనిక్ తదిత రెస్టారెంట్ బ్రాండ్స్ ఈ కంపెనీకి చెందినవే. ఇన్‌స్పైర్ బ్రాండ్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దోవోస్ నుంచి శుభవార్త అంటూ.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇన్‌స్పైర్ బ్రాండ్స్‌తో చేసుకున్న ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్