
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.
స్విట్జర్లాండ్‌లోని దోవోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన కేటీఆర్.. జ్యూరిచ్‌లో ప్రవాస తెలుగువారు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, డెన్మార్క్, జర్మనీ, నార్వే తదితర దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర అభివృద్ధి నమూనాను మంత్రి ప్రవాసులకు వివరించారు. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,000 కోట్ల నుంచి రూ.1.83 లక్షల కోట్లకు పెరిగాయని వెల్లడించారు.
కేటీఆర్
పథకాలతో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారు: కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సాధించిన ప్రగతిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో నర్సరీ, వైకుంట ధామం (శ్మశాన వాటిక) ఉన్నాయని, గ్రామ పంచాయతీ బడ్జెట్‌లో 10శాతం హరిత బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్లు చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతు వేదికలను నిర్మించి, 24 గంటలూ ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం గులాబీ విప్లవం (మాంసం), పసుపు విప్లవం (ఆయిల్ పామ్), నీలి విప్లవం (లోతట్టు మత్స్య), శ్వేత విప్లవం (పాలు), హరిత విప్లవం (పంటలు) అనే ఐదు విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు.