సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీలుసమావేశాన్ని ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి కేటీఆర్. సత్య నాదెళ్లతో బిజినెస్‌తో బిర్యానీ గురించి చర్చినట్లు ఆయన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇద్దరి మధ్య ప్రధానంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు కేంద్రం గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అంతకుముందు మోదీతో భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలుగువారు. హైదరాబాద్ నగరంలో జన్మించారు. అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. సత్య నాదెళ్ల తండ్రి నాదెళ్ల యుగంధర్ మాజీ ఐఏఎస్ అధికారి. మణిపాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత తదుపరి చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతేడాది నాదెళ్లకు దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో కేంద్రం సత్కరించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌కు రావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీని సత్య నాదెళ్ల కలిశారు. డిజిటల్ ఇండియా విజన్‌తో ప్రపంచానికి భారత్ మార్గదర్శిగా మారడానికి తాము సాయం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా మోదీ సత్య నాదెళ్ల తో చెప్పారు.