Loading...
Forbes Global Billionaire : ఒక్కరోజులో రూ.59 వేల కోట్ల సంపద.. ప్రపంచంలోనే టాప్ గెయినర్‌గా ముకేశ్ అంబానీ
ఒక్కరోజులో రూ.59 వేల కోట్ల సంపద.. ప్రపంచంలోనే టాప్ గెయినర్‌గా ముకేశ్ అంబానీ

Forbes Global Billionaire : ఒక్కరోజులో రూ.59 వేల కోట్ల సంపద.. ప్రపంచంలోనే టాప్ గెయినర్‌గా ముకేశ్ అంబానీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పెరగడంతో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ సంపద ఒక్కరోజులోనే రూ.59 వేల కోట్లకుపైగా పెరిగింది. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపద పెంచుకున్న బిలియనీర్‌గా ఆయన నిలిచారు. కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. ఫలితంగా రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. నవంబర్ 2న అంబానీ సంపద 7.85 శాతం పెరిగింది. ఒక్కరోజులోనే ఆయన నికర సంపద 6.3 బిలియన్ డాలర్లు పెరిగింది. భారత కరెన్సీలో ఇది రూ.59 వేల కోట్లకుపైగా ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తిగా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.

వివరాలు 

ఒక్కరోజులో 1.7 బిలియన్ డాలర్లు

అంబానీ తర్వాత స్పెయిన్‌కు చెందిన రిటైల్ రంగ బిలియనీర్ అమాన్సియో ఒర్టెగా రెండో స్థానంలో ఉన్నారు.

ఆయన సంపద ఒక్కరోజులో 1.7 బిలియన్ డాలర్లు పెరిగింది. భారత కరెన్సీలో ఇది రూ.16.12 వేల కోట్లకుపైగా ఉంటుంది.

చైనాకు చెందిన జోంగ్ షాన్షాన్ సంపద 1.5 బిలియన్ డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో ఇది రూ.14.22 వేల కోట్లకు సమానం.

దీంతో అత్యధికంగా సంపద పెంచుకున్న బిలియనీర్ల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

వివరాలు 

అంబానీ, అదానీ సంపద ఎంతంటే?

ఒక్కరోజులో సంపద భారీగా పెరగడంతో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 23వ స్థానానికి చేరుకున్నారు.

ఆయన మొత్తం సంపద 88.3 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది.

భారత కరెన్సీలో ఇది సుమారు రూ.8.35 లక్షల కోట్లు. దీంతో భారత్‌లో అత్యంత సంపన్న వ్యక్తిగా అంబానీ కొనసాగుతున్నారు.

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 79.12 బిలియన్ డాలర్ల సంపదతో భారత్‌లో రెండో స్థానంలో ఉన్నారు.

ఆయన సంపద భారత కరెన్సీలో సుమారు రూ.7.50 లక్షల కోట్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 26వ స్థానంలో కొనసాగుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆరేళ్లలోనే అత్యధికంగా పెరిగిన రిలయన్స్ షేర్లు

అంబానీ సంపద ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ర్యాలీ ప్రధాన కారణమైంది.

నవంబర్ 2న జరిగిన ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్లు 11.6 శాతం పెరిగాయి.

అంతకుముందు శుక్రవారం రూ.1,164.90 వద్ద ముగిసిన ఈ షేరు.. నవంబర్ 2న 5 శాతానికిపైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది.

చివరకు రూ.135.10 లాభంతో 11.60 శాతం పెరిగి రూ.1,300 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీలోనూ రిలయన్స్ షేర్లు అత్యధిక లాభాలు సాధించిన స్టాక్‌గా నిలిచాయి.

ఒక్కరోజు ట్రేడింగ్‌లో ఈ స్థాయిలో షేరు ధర పెరగడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి.

సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17.57 లక్షల కోట్లుగా నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

అంచనాలను మించిన రెండో త్రైమాసిక ఫలితాలు

శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 40.6 శాతం పెరిగి రూ.25,548 కోట్లకు చేరుకుంది.

విశ్లేషకులు అంచనా వేసిన దానికంటే ఈ లాభం గణనీయంగా ఎక్కువగా ఉంది.

ఈ ఫలితాలు పెట్టుబడిదారుల్లో రిలయన్స్ షేర్లపై నమ్మకాన్ని పెంచాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

కంపెనీ ప్రధాన వ్యాపారాలైన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ విభాగాల్లో మార్జిన్లు పెరగడం కలిసొచ్చింది. టెలికాం విభాగమైన జియో లాభాలు కూడా పెరిగాయి.

వివరాలు 

అంచనాలను మించిన రెండో త్రైమాసిక ఫలితాలు

సమీక్షా త్రైమాసికంలో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ విభాగం ఆదాయం 68 శాతం పెరిగింది.

ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ప్లాట్‌ఫామ్స్ ఆదాయం 16.6 శాతం వృద్ధి చెందింది.

అయితే రిటైల్ వ్యాపారం మాత్రం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే కొంత నిరాశపరిచింది.

ఈ విభాగాల్లో వచ్చిన ఫలితాలు, కంపెనీ మొత్తం లాభాల్లో నమోదైన వృద్ధి రిలయన్స్ షేర్లకు బలాన్నిచ్చాయి.

దీంతో షేరు ధర భారీగా పెరిగి, అంబానీ సంపదలోనూ ఒక్కరోజులోనే గణనీయమైన వృద్ధి నమోదైంది.

ADVERTISEMENT