
Gold: బంగారం అమ్మడానికి ఏటీఎం వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారాన్ని విక్రయించాలనుకునే వారికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత 'గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం'ను ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌కి చెందిన గోల్డ్‌సిక్కా సంస్థ వెల్లడించింది.
మూడు సంవత్సరాల క్రితం బంగారం కొనుగోలుకు ఏటీఎంను ప్రవేశపెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు ప్రజలు తమ బంగారాన్ని విక్రయించగలిగే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ యంత్రం ద్వారా పాత బంగారాన్ని విక్రయించడం, కొత్త నగలతో మార్పిడి చేసుకోవడం, నగదుగా పొందడం వంటి సేవలు లభించనున్నాయి.
ఇప్పటికే యంత్రం సిద్ధంగా ఉన్నా మరొక నెలన్నరలో అందుబాటులోకి తేవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. తరుజ్ తెలిపారు.
Details
మార్కెట్ ధరను ఎంతో తెలుపుతుంది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారాన్ని యంత్రంలో ఉంచితే, ముందుగా ధ్రువీకరణ అవసరం ఉంటుంది. ఆ తరువాత యంత్రం బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను పరీక్షిస్తుంది.
ఇక ప్రస్తుత మార్కెట్ ధరను అనుసరించి ఎంత మొత్తం వస్తుందో వినియోగదారునికి తెలుపుతుంది.
వినియోగదారు ఆ విలువను ఆమోదించిన తర్వాత, వారి ఎంపిక ప్రకారం నగదు లేదా కొత్త బంగారాన్ని అందిస్తామని వివరించారు.
బంగారానికి బదులుగా ఇచ్చే నగదు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యేందుకు సుమారు 30 నిమిషాలు పడుతుందని స్పష్టం చేశారు.