
ఎక్కువ పని చేయాల్సి వస్తోందని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ని తగలబెట్టిన ఉద్యోగి
ఈ వార్తాకథనం ఏంటి
జార్జియాలో మెక్ డొనాల్డ్స్ ఉద్యోగి ఊహించని ఘటనకు పాల్పడ్డాడు. షాప్‌కు ఎక్కువ మంది కస్టమర్లు రావడంతో ఎక్కువ పని చేయాల్సి వస్తోందని ఏకంగా ఆ స్టోర్ కే అగ్ని పెట్టాడు.
ఈ ఘటన గతేడాది ఏప్రిల్‌లో జార్జియాలో జరిగింది.
ఈ కేసులో నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
యూఎస్ అటార్నీ కార్యాలయం వివరాల మేరకు స్టోర్ నుంచి భారీ ఎత్తున్న మంటలు వ్యాపించాయి.
దీంతో ఆ దారిన వచ్చిన వాళ్లంతా భయపడిపోయారు.
Details
ఐదేళ్లు జైలు శిక్ష
నిందితుడు స్టోర్ తగలబెట్టిన తర్వాత అదంతా వీడియో తీశాడు. వెంటనే పోలీసులు అరెస్టు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు.
దాదాపుగా ఏడాది పాటు దీనిపై విచారణ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ఆస్తినే ధ్వంసం చేయడమే కాకుండా, వ్యక్తిగత కక్షతో చుట్టూ ఉన్న వాళ్లని ప్రమాదంలో నెట్టారన్నారు.
స్టోర్ తగలబెట్టిన సమయంలో లోపల చాలమంది ఉన్నారు. ఈ ఘటనను తీవ్ర నేరంగా కోర్టు పరిగణించింది.
ఐదేళ్ల జైలుశిక్షతో పాటు ఆస్తినష్టం ఎంతవచ్చిందో అంత మెత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.