LOADING...
Prices Rise: సామాన్యుడికి మరో షాక్.. పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు
సామాన్యుడికి మరో షాక్.. పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు

Prices Rise: సామాన్యుడికి మరో షాక్.. పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా వినియోగదారులకు షాకింగ్ సమాచారం ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2027 తొలి త్రైమాసికం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది. కేవలం డాబర్ మాత్రమే కాకుండా హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), నెస్లే, బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరగడం, ప్యాకేజింగ్ వ్యయాలు అధికమవడం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్న ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

వివరాలు

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ముడి చమురు సరఫరాపై పడుతోంది. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. బిస్కెట్లు, వంట నూనెలు, పాలు, కాఫీ, టీ పొడి వంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు కూడా స్థిరంగా పెరుగుతుండటంతో కంపెనీల తయారీ వ్యయం మరింత అధికమవుతోంది.

వివరాలు

గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం

కొన్ని త్రైమాసికాలుగా మందగించిన గ్రామీణ మార్కెట్ ఇప్పుడు మళ్లీ కోలుకుంటోంది. అయితే ఇదే సమయంలో తయారీ ఖర్చులు పెరుగుతుండటంతో కంపెనీలు తమ లాభదాయకతను కాపాడుకునేందుకు ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏ ఉత్పత్తుల ధరలు పెరగొచ్చు? ఈ పరిస్థితుల ప్రభావంతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై మరింత భారం పడే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్ కేర్ ఉత్పత్తులు: సోపులు, షాంపూలు, డిటెర్జెంట్లు, టూత్‌పేస్టులు ప్యాకేజ్డ్ ఫుడ్స్: బిస్కెట్లు, స్నాక్స్, నూడుల్స్, చాక్లెట్లు పానీయాలు: పాలు, టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన నెలకొన్న సమయంలో, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయన్న వార్త సామాన్య ప్రజలను కలవరపెడుతోంది.

Advertisement